English | Telugu

మూడు రోజుల్లో చ‌నిపోతాన‌నుకున్నా!

"మూడు రోజుల్లో చ‌నిపోతాన‌ని, రెండు మూడు రోజుల్లో నా శ‌వాన్ని తీసుకెళ్లి చితికి నిప్పుపెడ‌తార‌ని అనుకుంటూ ఉండేవాడిని. అప్పుడు నా మైండ్ సెట్ అలా వుంది" అంటూ భావోద్వేగానికి లోన‌య్యారు హీరో డాక్ట‌ర్‌ రాజ‌శేఖ‌ర్‌. ప్ర‌ముఖ హాస్య న‌టుడు అలీ వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రిస్తున్న `ఆలీతో స‌ర‌దాగా` షోలో రాజ‌శేఖ‌ర్, జీవిత దంప‌తులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని అభిమానుల‌తో పంచుకున్నారు.

ఈ సంద‌ర్భంగా డా. రాజ‌శేఖ‌ర్ భావోద్వేగానికి లోన‌వ్వ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. కొంత విరామం త‌రువాత డా. రాజ‌శేఖ‌ర్ మ‌ల‌యాళ సినిమా ఆధారంగా రీమేక్ అవుతున్న‌ `శేఖ‌ర్‌` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా `ఆలీతో స‌ర‌దాగా` కార్య‌క్ర‌మంలో రాజ‌శేఖర్ , జీవిత సంద‌డి చేశారు. సినిమాల్లో న‌టిస్తున్న‌ప్పుడు వేరు వేరు ప్రివ్యూ షోల‌కు వెళ్లి వ‌స్తుంటే తొలిసారి చూసుకున్నామ‌ని జీవిత ఈ సంద‌ర్భంగా తెలిపింది.

`శేఖ‌ర్‌` క‌థ త‌న‌ని ఎంత‌గానో ఎట్రాక్ట్ చేసింద‌ని, సినిమా షూటింగ్ మొద‌లుపెట్టాలి అని అనుకున్న స‌మ‌యంలోనే రాజ‌శేఖ‌ర్ కోవిడ్ బారిన ప‌డ్డార‌ని తెలిపారు. అప్పుడు ఆయ‌న‌కు ఎంత సీరియ‌స్ అయిందో అంద‌రికి తెలిసిందేన‌నీ, నెల రోజుల పాటు రాజ‌శేఖ‌ర్ ఐసీయూలో వున్నారని జీవిత ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చారు.

Also Read:మ‌హేశ్‌కు క‌రోనా.. స్వీయ ఐసోలేష‌న్‌లో సూప‌ర్‌స్టార్‌!

అప్పుడే "నాకు సీరియ‌స్ అయిన‌ప్పుడు చ‌నిపోతాన‌ని అనుకున్నా. రెండు మూడు రోజుల్లో నా శ‌వాన్ని తీసుకెళ్లిపోయి చితికి నిప్పుపెడ‌తార‌ని అనుకుంటూ వుండేవాడిని. అప్ప‌టికి నా మైండ్ అలా వుంది"అని రాజ‌శేఖ‌ర్ భావోద్వేగానికి లోన‌య్యారు. "న‌ట‌వార‌సులు ఉంటే బాగుండేద‌ని మీకెప్పుడైనా అనిపించిందా?" అని అలీ అడిగితే "నాకు చాలా సార్లు అనిపించింది కానీ కుద‌ర‌లేద‌"ని రాజ‌శేఖ‌ర్ చెప్ప‌డంతో అలీతో స‌హా అంతా న‌వ్వేశారు. తాజాగా విడుద‌ల చేసిన ఈ ప్రోమో ఆక‌ట్టుకుంటోంది. ఈ ఎపిసోడ్ వ‌చ్చే సోమ‌వారం రాత్రి 9:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది.


Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.