English | Telugu

Nuvvunte Naa Jathaga : వంద ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న  నువ్వుంటే నా జతగా!

స్టార్ మా సీరియల్స్ లు అత్యధిక టీఆర్పీ రేటింగ్ తో సాగుతుంటాయి. అందుకేనేమో భిన్నమైన కాన్సెప్ట్ తో కొత్త సీరియల్స్ వస్తుంటాయి. అయితే వీటిల్లో గుండె నిండా గుడిగంటలు, ఇంటింటి రామాయణం, ఇల్లు ఇల్లాలు పిల్లలు, కార్తీక దీపం2, బ్రహ్మముడి, చిన్ని సీరియల్స్ ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకెళ్తున్నాయి.

ఇక గత సీజన్ బిగ్ బాస్-8 తర్వాత మొదలైన నువ్వుంటే నా జతగా సీరియల్ తెలుగు ప్రేక్షకులన అభిమానాన్ని పొందుతుంది. ప్రస్తుతం ఈ సీరియల్ వంద ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ హీరోగా దేవ పాత్రలో కన్పిస్తుండగా.. మిథున పాత్రలో కొత్త అమ్మాయి నటిస్తోంది. శారద, సత్యమూర్తి ఇద్దరు దేవ వాళ్ళ అమ్మనాన్నలు. ఈ సీరియల్ ఎలా మొదలైందో ఓసారి చూద్దాం..

ఒక ఊరిలో దేవా అనే రౌడీ, మిథున గొప్పింటి అమ్మాయి ఉంటారు. ఓ రోజున మిథున తన ఫ్రెండ్ పెళ్లి గుడిలో చేపిస్తుంటుంది. ఇంతలో కొంతమంది రౌడీలని వెంబడిస్తూ దేవా ఆ గుడిలోకి వస్తాడు. ‌ఇక రౌడీలని ఛేజ్ చేసే క్రమంలో పెళ్ళికొడుకుకి దేవా తగిలి అతను పడిపోతాడు. ఇక మిథున చేస్తున్న పెళ్ళి ఆగిపోతుంది. దాంతో దేవాని మిథున లాగిపెట్టి కొడుతుంది. నీ వల్ల పెళ్లి ఆగిందంటూ దేవాని తిడుతుంది. తాళి కడితేనే పెళ్ళి జరిగినట్టా అని దేవా వాదిస్తుంటాడు. దాంతో మిథున అవునని అంటుంది. ఇక దేవా పక్కన ఉన్న తాళిని తీసుకొచ్చి మిథున మెడలో కట్టేసి.. ఇప్పుడు నీ మెడలో నేను తాళి కట్టాను.. అంతమాత్రానా మనం కలిసి ఉండాలా‌‌.. పోవే అంటు రూడ్ గా మాట్లాడి తనని వదిలేసి వెళ్ళిపోతాడు. పెళ్లికి, మన ఆచారాలకి విలువనిచ్చే మిథున మొదట షాకవుతుంది. ఆ తర్వాత ఆలోచనలో పడిపోతుంది. ఇక ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన అమ్మనాన్నలకి మిథున చెప్తుంది. ఆ తాళి తీసేసి ఇంట్లోకి రమ్మని వాళ్ళు గెంటేస్తారు. దాంతో మిథున ఇల్లు వదిలి దేవా దగ్గరికి వస్తుంది. ఇక దేవా వాళ్ళ నాన్న దేవాకి కనీస మర్యాద కూడా ఇవ్వడు. ఎందుకంటే ఎప్పుడు చూసిన గొడవలు పడుతుంటాడని అతడిని తిడుతూనే ఉంటాడు. ఇక దేవాతో పాటు ఉండటానికి వచ్చిన మిథునని ఎవరు అంగీకరించరు. అయితే కొన్ని ఎపిసోడ్ ల ముందు దేవా వాళ్ళ నాన్న మీద ఎటాక్ జరుగుతుంది. అందులో మిథున తన ప్రాణాలు అడ్డుపెట్టి మరీ దేవ వాళ్ళ నాన్న సత్యమూర్తిని కాపాడుతుంది. ఈ విషయం తెలుసుకున్న దేవా వాళ్ల అమ్మ శారద తనని కోడలిగా అంగీకరిస్తుంది. మరి ఇష్టం లేని పెళ్లితో అత్తారింట్లో అడుగుపెట్టిన మిథున జీవితం ఎలా సాగనుంది? నువ్వుంటే నా జతగా అని తన భర్త దేవా ఎప్పుడంటాడో తెలియాలంటే ఈ సీరియల్ చూడాల్సిందే. ఇప్పటికే ఈ సీరియల్ వంద ఎపిసోడ్ లు పూర్తి చేసుకోగా ఈ సీరియల్ టీమ్ సంబరాలు చేసుకుంటున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.