English | Telugu

నాకు ఓట్లు వేయద్దొంటూ సింపథీ స్ట్రాటజీ ప్లే చేసిన నిఖిల్.. 

బిగ్ బాస్ సీజన్-8 లో పన్నెండో వారం జరిగిన నామినేషన్లో కన్నడ బ్యాచ్ ని టార్గెట్ చేసి భారీగా ఓట్లు పడ్డాయి. అయితే వీటన్నింటికి మూల కారణం నిఖిల్, యష్మీ.. వీరిద్దరి స్ట్రాటజీల వల్ల పృథ్వీ, ప్రేరణ కూడా వరెస్ట్ కంటెస్టెంట్స్ లిస్ట్ లోకొ చేరిపోయారు.‌

నిఖిల్ ఒక్కొక్కరి నామినేషన్ ని తల్చుకొని భాదపడుతున్నాడు. సీత అసలు అలా ఎందుకు అందో అర్థం కాలేదంటూ యష్మీతో నిఖిల్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇక హౌస్‌లో ఉండాలని లేదని.. తాను బయటికి వెళ్లిపోతా అంటూ బిగ్‌బాస్‌కి చెప్పాడు నిఖిల్. తనకి ఇక ఆడియన్స్ ఎవరూ ఓట్లేయొద్దని.. ఈ వారం హౌస్‌ నుంచి వెళ్లిపోయేందుకు రెడీగా ఉన్నానంటూ నిఖిల్ చెప్పాడు.

నిన్న జరిగిన ఎపిసోడ్ లో యష్మీతో చాలాసేపు మాట్లాడతాడు నిఖిల్. సీత అలా అన్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదని నిఖిల్ అడుగగా.. తను అలా మాట్లాడేసరికి నేను బ్లాంక్ అయ్యాను. అందుకే ఏం మాట్లాడలేదని యష్మీ అంది. ఇక యష్మీ కూడా తన తప్పు ఉందని అంది. ఇక తను వెళ్లిపోయాక నిఖిల్ బిగ్ బాస్ తో మాట్లాడాడు.‌ ఇక తనకి ఓట్లు వేసే వారికి ఓట్లు వేయకని చెప్పాడు. హౌస్ లో ఉండాలని లేదని నిఖిల్ అన్నాడు.

ఇక హౌస్ లో గ్రూపిజం గురించి అందరు మాట్లాడేసరికి నిఖిల్ తీసుకోలేక అతని వరిజినాలిటి బయటపడిందనే భయంతో ఆడియన్స్ ఓట్లు వేయకండి అంటే సింపథీ వర్కవుట్ అవుతుందనే స్ట్రాటజీ ప్లే చేశాడు నిఖిల్. అయితే కాసేపటికి మళ్ళీ మనసు మార్చుకున్నట్టుగా నాకు ఓట్లు వేయండి నేను ఫైనల్ వరకు ఉండి కప్పుతో బయటకొస్తానని నిఖిల్ అన్నాడు. మరి నిఖిల్ ఫ్లిప్పింగ్ గేమ్ ని ఎంతవరకు సపోర్ట్ చేస్తారో చూడాలి మరి.


Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.