English | Telugu

బ్యాంక్‌లో తిలోత్త‌మ‌కు న‌య‌ని ఇచ్చిన షాక్ ఇదే!

బుల్లితెర‌పై విజ‌య‌వంతంగా దూసుకుపోతోన్న సీరియ‌ల్స్‌లో 'త్రిన‌య‌ని' ఒక‌టి. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ సీరియ‌ల్‌ని రూపొందించారు. జ‌ర‌గ‌బోయేది ముందే తెలిసే వ‌రం వున్న ఓ యువ‌తి త‌న భ‌ర్త త‌ల్లి హ‌త్య వెన‌కున్న ర‌హ‌స్యాన్ని ఎలా ఛేధించింది? అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌తో ఈ సీరియ‌ల్‌ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా న‌డుస్తోంది. ఆస‌క్తిక‌ర మ‌లుపులు, ట్విస్ట్ ల‌తో మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

అషికా గోపాల్‌, చందూ గౌడ జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, విష్ణు ప్రియ‌, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు త‌దిత‌రులు న‌టించారు. క‌సి కార‌ణంగా ఫ్యాక్టరీ నానాటికీ న‌ష్టాల్లో కూరుకుపోతూ వుంటుంది. ఇది తిలోత్త‌మ‌కు ఇబ్బందిక‌రంగా మారుతుంది. చివ‌రికి అకౌంట్ నుంచి డ‌బ్బులు తీయ‌డానికి కూడా వీలు లేకుండా పోతుంది. ఇదే విష‌యాన్ని హాసిని హెచ్చ‌రిస్తుంది. క‌సిని న‌మ్ముకుంటే అంతా మ‌సే అని చెబుతుంది. ఇదే స‌మ‌యంలో న‌య‌ని, విశాల్ సొంతంగా వ్యాపారం చేయ‌బోతున్నార‌ని, బ్యాంక్ లోన్‌కి అప్లై చేయ‌బోతున్నార‌ని తెలియ‌డంతో తిలోత్త‌మ‌, క‌సి, వ‌ల్ల‌భ ఆ ప్ర‌య‌త్నాన్ని అడ్డుకోవ‌డానికి వెళ‌తారు.

అదే స‌మ‌యంలో న‌య‌ని, విశాల్ బ్యాంకులో మేనేజ‌ర్ తో మాట్లాడుతుంటారు. క‌రెక్ట్ టైమ్‌కే వ‌చ్చామ‌ని వెట‌కారాలు పోయిన క‌సి.. విశాల్‌కుకు గాయ‌త్రీదేవి ఇండ‌స్ట్రీస్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని చెబుతుంది. తిలోత్త‌మ కూడా వంత పాడుతుంది. దీంతో న‌య‌ని - విశాల్ త‌మ‌కు పుండ‌రీనాథం తాత వ‌ల్ల ల‌భించిన పెట్టెని లోనికి తీసుకుర‌మ్మంటారు. అది ఇక్క‌డికి ఎందుక‌ని తిలోత్త‌మ అంటుంది. చెప్తా అని విశాల్ "అమ్మ.. నువ్వే ఈ పెట్టెని ఓపెన్ చేయి" అంటాడు. తెరిచి చూసిన తిలోత్త‌మ అందులో బంగారు ఆభ‌ర‌ణాలు, వ‌జ్రాలు వుండ‌టంతో ఒక్క‌సారిగా షాక‌వుతుంది. క‌సి, వ‌ల్ల‌భ ప‌రిస్థితీ అంతే. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.