English | Telugu

య‌ష్ - వేద‌ల‌కు మాళ‌విక వార్నింగ్‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా సాగుతోంది. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టించారు. కాంచ‌న‌, మాలినిల ద్వారా వేద ఇంటి నుంచి వెళ్లిపోయింద‌ని, ఇక రాద‌ని తెలుసుకున్న ఖుషీ వెంట‌నే వెళ్లి వేద‌ని ఇంటికి ర‌మ్మంటుంది. నేను, నువ్వు, డాడీ మ‌నం ముగ్గురం ఒక పార్టీ క‌దా ఎందుకు మ‌మ్మ‌ల్ని వ‌దిలేసి ఇక్క‌డికి వ‌చ్చావ్? అంటూ నిల‌దీస్తుంది. ఆ త‌రువాత ఇంటికి రామ్మా అంటూ 1..2..3.. లెక్క పెడ‌తాను.. నీకు ఇంటి రావాల‌ని వుంటే న‌న్ను పిలువు లేదంటే వెళ్లిపోతాను అంటుంది. వేద స్పందించ‌క‌పోవ‌డంతో భారంగా అక్క‌డి నుంచి అపార్ట్ మెంట్ బ‌య‌టికి వెళ్లిపోతుంది.

విష‌యం తెలిసి య‌ష్ .. వేద‌ని మంద‌లిస్తాడు. త‌ను అడిగినా రావా? అంటూ ఫైర‌ల్ అవుతాడు. ఎందుకిలా చేస్తున్నావ‌ని ఆవేశంతో ర‌గిలిపోతాడు. త‌న‌కు ఏదైనా జ‌రిగితే నిన్ను క్ష‌మించ‌ను అంటూ మండి ప‌డ‌తాడు. క‌ట్ చేస్తే వేద‌.. య‌ష్ ఇద్ద‌రు క‌లిసి ఖుషీని వెతుక్కుంటూ మాళ‌విక‌, అభిమ‌న్యుల వ‌ద్ద‌కు వెళ‌తారు. య‌ష్ ఆవేశంతో అభిమ‌న్యు కాల‌ర్ ప‌ట్టుకుని ఖుషీ ఎక్క‌డ అని నిల‌దీస్తాడు. త‌న‌కు తెలియ‌ద‌ని అభిమ‌న్యు అన‌డంతో య‌ష్ ఆవేశంతో ఊగిపోతాడు.

విష‌యం ఆర్థం కావ‌డంతో మాళ‌విక రివ‌ర్స్ కౌంట‌ర్ ఇవ్వ‌డం మొద‌లు పెడుతుంది. ఖుషీ నా కూతురు దాచి పెట్టాల్సిన అవ‌స‌రం నాకు లేదు. ఖుషీ ఎక్క‌డుందో చెప్పండి.. గంట టైమ్ ఇస్తున్నాను. ఆలోగా ఖుషీ సేఫ్ అన్న న్యూస్ నా చెవినప‌డాలి. లేదంటే ఇద్ద‌రిపై కేసు పెడ‌తాను అంటూ య‌ష్‌, వేద‌ల‌కు మాళ‌విక వార్నింగ్ ఇస్తుంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.