English | Telugu

'నీ బాణం నీకే తిరిగి గుచ్చుకోకుండా చూసుకో'.. అభికి య‌ష్ వార్నింగ్‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, మిన్ను నైనిక‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ఆనంద్‌, సులోచ‌న‌, వ‌ర‌ద‌రాజులు త‌దిత‌రులు న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా ముందుకు సాగుతోంది. కైలాష్ ని క‌లిసిన కాంచ‌న త‌న త‌ల్లికి విష‌యం చెప్ప‌డంతో మాలిని కైలాష్ ని విడిపించ‌మ‌ని, కేసు వాప‌స్ తీసుకోమ‌ని య‌ష్ తో అంటుంది. అత‌ని భవిష్య‌త్తుని దేవుడు రాస్తాడ‌ని య‌ష్ ఆఫీస్ కి వెళ్లిపోతాడు.

ఇదిలా వుంటే వేద ఇంట్లో జ‌రిగిన విష‌యాన్ని చెప్పడానికి మాళ‌విక ఫ్రెండ్ తార ఇంటికి వ‌స్తుంది. "వేద మీద నువ్వు గెల‌వ‌బోతున్నావ్ కంగ్రాట్స్" అంటూ విష్ చేస్తుంది. య‌ష్ మీద పైచేయి సాదించ‌బోతున్నావ‌ని అభిమ‌న్యుతో చెబుతుంది. "య‌ష్ ఇంట్లో సునామీ పుట్టించిందిది, వాళ్ల‌ని అల్లాడించింది, దిక్కుతోచ‌ని ప‌రిస్థితులు క‌ల్పించింది. ఆ సునామి పేరు కైలాష్‌." అని చెబుతుంది. దీంతో హ్యాపీగా ఫీలైన మాళ‌విక‌, అభిమ‌న్యు ఇదే అద‌నుగా కైలాష్ ని అడ్డుపెట్టుకుని య‌ష్‌ను దెబ్బ‌కొట్టాల‌నుకుంటారు.

క‌ట్ చేస్తే.. య‌ష్ ఎదురుప‌డ‌టంతో "నువ్వు ప్ర‌తీ విష‌యంలో కామాలు పెడుతూ వెళుతున్నావు.. నేను ఏకంగా ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్ట‌బోతున్నాను" అంటాడు అభిమ‌న్యు. "నా మీద గెలుద్దామనే!.. ఉక్రోషం వుంటే స‌రిపోదు.. వ్యూహం వుండాలి" అంటూ వెట‌కారం చేస్తాడు య‌ష్‌. "ఆ వ్యూహాలే ర‌చించ‌డానికి వెళ్తున్నాను. నీ మీద సంధించ‌డానికి వెళుతున్నాను" అంటాడు అభిమ‌న్యు. "అయితే ఆ బాణం నీకే తిరిగి గుచ్చుకోకుండా చూసుకో" అని హెచ్చ‌రిస్తాడు య‌ష్‌. ఏం జ‌ర‌గ‌నుంద‌న్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.