English | Telugu

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.

డ్రాప్ చేస్తానంటే వద్దు ఫ్రెండ్ వస్తుందని మహా వెళ్ళిపోతుంది. మరొకవైపు చక్రి క్యాబ్ ఓనర్ కి
రోజు డబ్బులు ఇచ్చి వెళ్తుంటే అప్పుడే ఒక బుకింగ్ వచ్చింది వెళ్ళమని చెప్తాడు. చక్రి కస్టమర్ కోసం వెయిట్ చేస్తాడు. మహాకి తన ఫ్రెండ్ క్యాబ్ బుక్ చేస్తాడు. చక్రి కార్ అనుకొని మహా అందులో ఎక్కుతుంది. మహాని చూసి చక్రి ఫ్లాట్ అవుతాడు. అయ్యో సారీ అండి వేరే క్యాబ్ అనుకొని ఇందులో ఎక్కానని మహా కార్ దిగి వెళ్ళిపోతుంది. మరొకవైపు మాధవకి పెళ్లి చూపులు అని కన్నా రెడీ చేస్తాడు. ఆ తర్వాత కేశవ టీ స్టాల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ నాన్న నారాయణ ఉంటాడు. అక్కడే వాళ్ళ పెద్దనాన్న వీళ్ళ గురించి తక్కువగా మాట్లాడతాడు. ఎవడ్రా మీ ఇంటికి ఆడపిల్లని ఇచ్చేదని ఇష్టం వచ్చినట్లు తిడుతాడు. దాంతో కేశవ ఇంటికి కోపంగా వెళ్తాడు. చక్రి వస్తాడు.. అన్నయ్య ఎంత మంచిగా రెడీ అయిన పెళ్లి కాదు అంటూ కేశవ అంటాడు. దాంతో కేశవ, చక్రికి గొడవ అవుతుంది.

మరొకవైపు మహా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తన డిజైన్ చెప్తుంది. అది చూసి.. బాగుంది దాని గురించి గవర్నమెంట్ తో డిస్కషన్ చేస్తామని చెప్తారు. మహా బయటకు వచ్చాక ఓవర్ అంబిషన్ గా ఉందని వాళ్ళు అనుకుంటారు. అ తర్వాత మహా తన ఫ్రెండ్ అయిన అబ్బాయితో కలిసి మాట్లాడుతుంది. నా ఐడియా వాళ్లకు నచ్చిందని అతనితో చెప్తుంది. ఇంత అమాయకురాలివి ఏంటి మహా.. అలా అందరు చెప్పింది నమ్మేస్తావని అతను మహాపై జాలి చూపిస్తాడు. ఆ తర్వాత మహా వాళ్ళ నాన్న ప్రతాప్ తన ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు. నువ్వు షేర్స్ ఎందుకు వెనక్కి తీసుకుంటున్నావని అడుగుతాడు. మాకున్న డబ్బులు చాలు.. నీకు ఒక కూతురు ఉంది కదరా అని ప్రతాప్ అనగానే మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయింది.. నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది.. కమ్యూనిటీ లో మా పరువు తీసింది.. నీకు ఒక కూతురు ఉంది జాగ్రత్త అని అతను చెప్తాడు. అ తర్వాత ప్రతాప్ వస్తుంటే దారిలో మహా తన ఫ్రెండ్ బైక్ మీద వెళ్లడం చూసి షాక్ అవుతాడు. తరువాయి భాగంలో మహా అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసింది త్వరగా తనకి పెళ్లి చెయ్యాలని ప్రతాప్ తన భార్యతో చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.