English | Telugu

Brahmamudi: యాడ్ పూర్తిచేసిన రాజ్.. అప్పుని డ్యూటీ చేయవద్దని చెప్పిన ధాన్యలక్ష్మి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -910 లో..... స్వరాజ్ జ్యువలరీ డిజైన్స్ ప్రమోషన్ షూట్ కోసం డైరెక్టర్ ని పిలుస్తాడు రాజ్. డైరెక్టర్ గా వచ్చింది రాహుల్ పంపిన అతనే.. అతనెవరో కాదు పరోటాలు చేయడంలో స్పెషలిస్ట్. యాడ్ షూట్ చెయ్యమంటే కిచెన్ లో పనిమనిషి పరోటా చేస్తుంటే పరోటా చెయ్యడం అలా కాదని పరోటా చేస్తుంటాడు. దాంతో అందరు షాక్ అవుతారు. వాడు డైరెక్టర్ కాదు పరోటా స్పెషలిస్ట్ లాగా ఉన్నాడు.. డైరెక్టర్ కాదని ప్రకాష్ అంటాడు.

ఎవడ్రా నువ్వు అని అతన్ని బెదిరిస్తాడు. ఏదో డబ్బులకి కక్కుర్తి పడ్డానని అతను పారిపోతాడు. అయిపోయింది అంతా అయిపోయింది ఇక టైమ్ లేదని రాజ్ డిస్సపాయింట్ అవుతాడు. అప్పుడే కావ్య వచ్చి మీకు ఎలా యాడ్ చెయ్యాలో ఆలోచన ఉంది.. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు.. ఇద్దరు కలిసి యాడ్ పూర్తి చెయ్యండి అని కావ్య అనగానే నాకేం తెలియదని రాజ్ అంటాడు. సర్ నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎక్స్పీరియన్స్ ఉంది. నన్ను నమ్మండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అసిస్టెంట్ డైరెక్టర్ అనగానే రాజ్ సరే అంటాడు. ఇక అందరు కలిసి షూట్ కి రెడి అవుతారు. సీతారామయ్య, ఇందిరాదేవి ఒక జంటగా సుభాష్, అపర్ణ ఒక జంటగా, ధాన్యాలక్ష్మి, ప్రకాష్ ఒక జంటగా, కావ్య రాజ్ ఒక జంటగా.. కళ్యాణ్ సింగిల్ గా వచ్చి యాడ్ పూర్తి చేస్తారు.

దాంతో రాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనం అనుకున్నది ఏంటి.. అయ్యేది ఏంటని రాహుల్ తో రుద్రాణి అంటుంది. అదేం లేదు మమ్మీ ఈ యాడ్ సక్సెస్ కాదు.. వాళ్ళకి దాని గురించి ఏం తెలియదు కదా అని రాహుల్ అంటాడు. మరొకవైపు త్వరగా యాడ్ పంపించండని డైరెక్టర్ కి రాజ్ ఫోన్ చేసి చెప్తాడు. తరువాయి భాగంలో పాప విషయంలో అప్పు కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి సక్సెస్ అవుతుంది. అది న్యూస్ లో రావడం చూసి ధాన్యలక్ష్మి షాక్ అవుతుంది. ఇక అప్పు ఉద్యోగం చెయ్యనవసరం లేదని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.