English | Telugu

Karthika deepam2 : మంచివాడిలా నటిస్తున్న గౌతమ్.. పెళ్ళికి ఒకే చెప్పిన జ్యోత్స్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -308 లో..... జ్యోత్స్నకి పెళ్లి చూపులు జరుగుతాయి. అబ్బాయి గౌతమ్.. జ్యోత్స్న ఫ్రెండ్ అందరి ముందు మంచివాడిలాగా యాక్ట్ చేస్తుంటాడు. మా ఆస్తులకి ఏకైక వారసురాలు అని శివన్నారాయణ చెప్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న, గౌతమ్ లని పక్కకి వెళ్లి మాట్లాడుకోమని చెప్తారు. దాంతో ఇద్దరు పక్కకి వెళ్లి మాట్లాడుకుంటారు. మీ బావని మర్చిపోయావా అని గౌతమ్ అడుగుతాడు. గతం గురించి మర్చిపోవాలని జ్యోత్స్న చెప్తుంది. నువ్వు ప్రాక్టికల్ గా ఉంటావని గౌతమ్ అంటాడు. జ్యోత్స్నకి రెడ్ రోజ్ ఇస్తాడు గౌతమ్. ఎందుకు నేను అంటే ఇంత ఇష్టమని జ్యోత్స్న అడుగుతుంది.

ఇందాకే చెప్పాడు కదా.. మీ తాతయ్య ఈ ఆస్తులకి ఏకైక వారసురాలు అని.. నా ఎంజాయ్ కి లిమిట్ లేదని గౌతమ్ తన మనసులో అనుకుంటాడు. అప్పుడే పారిజాతం వచ్చి వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్తుంది.
ఇక ముహూర్తాలు పెట్టుకుందామని గౌతమ్ పేరెంట్స్ అంటారు. దాంతో పంతులు గారు నాలుగు రోజుల్లో నిశ్చితార్థానికి మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో ఇరు కుటుంబాలు ఆ ముహూర్తాన్ని ఖాయం చేసుకుంటారు. జ్యోత్స్న స్వీట్ బాక్స్ తో కార్తీక్ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది ఏంటే పెళ్లి చూపులు ఇష్టం లేక ఇలాగే వచ్చేసావా అంటూ కాంచన పొరపాటు పడి జ్యోత్స్నని తిట్టేస్తుంది.

స్వీట్ బాక్స్ తో వచ్చినా కూడా మీకు అర్ధం కాలేదా అని జ్యోత్స్న అంటుంది. ఈ మధ్య స్వీట్ బాక్స్ తో అందరు వస్తున్నారు. అందుకే అర్ధం అవ్వలేదని కార్తీక్ అంటాడు. నాకు పెళ్లి చూపులు జరిగాయి నాలుగు రోజుల్లో నిశ్చితార్థమని జ్యోత్స్న అందరికి స్వీట్ ఇస్తుంది‌ కార్తీక్ కి ఇచ్చేసరికి బాక్స్ కాళీ అవుతుంది. నువ్వు ఈ స్వీట్ ని మిస్ అవుతున్నావ్ బావ అని జ్యోత్స్న ఏదో తేడాగా అంటుంటే.. దీప స్వీట్ తీసుకొని అందులో సగం తీసుకుంటాడు. పంచుకునేవారు పక్కనే ఉన్నప్పుడు ఎందుకు టెన్షన్ అని కార్తీక్ అంటాడు. ఎప్పటిలాగే దీపని బాధపెట్టి జ్యోత్స్న వెళ్ళిపోతుంది. దశరథ్, సుమిత్ర, శివన్నారాయణ ముగ్గురు నిశ్చితార్థానికి పిలవాల్సిన లిస్ట్ ప్రిపేర్ చేస్తారు‌. అందులో కాంచన పేరు రాయలేదని దశరథ్ అడుగుతాడు. వద్దని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.