English | Telugu

Karthika Deepam2 : నా కొడుకుని పంపించండి అంటూ నిలదీసిన శ్రీధర్.. వాళ్ళిద్దరిపై జ్యోత్స్నకి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -374 లో.. జ్యోత్స్న ఇంట్లో దీప ఇల్లు క్లీన్ చేస్తుంది. ఏమైనా కావాలా అని జ్యోత్స్నని దీప అడుగుతుంది. ఏం వద్దు అంటూ జ్యోత్స్న దీప వంక అలాగే చూస్తుంది. అప్పుడే కార్తీక్ కూరగాయలు పట్టుకొని వచ్చి.. దీప ఈ రోజు ఈ వంటలు చేయు అని చెప్తుంటే.. అప్పుడే పారిజాతం వస్తుంది. నువ్వు ఇచ్చిన పనిష్మెంట్ వాళ్లకు ఎంటర్‌టైన్మెంట్ లాగా ఉందే అని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది.

అలా అయితే నువ్వు కూడా పని మనిషిలాగా మారమని కార్తీక్ వెటకారంగా మాట్లాడతాడు. దీప టీ పాయ్ క్లీన్ చేస్తుంది. కార్తీక్ బాబు ఈ దుమ్ము పోవట్లేదని దీప అనగానే.. ఎందుకు పోదు, ఇలా గట్టిగా తుడిస్తే ఏ దుమ్ము అయిన పోతుందని జ్యోత్స్న, పారిజాతానికి కౌంటర్ ఇచ్చేలా కార్తీక్ మాట్లాడతాడు. అప్పుడే శ్రీధర్ వస్తాడు. శ్రీధర్ వచ్చేసరికి కార్తీక్ టీ పాయ్ క్లీన్ చేస్తుంటాడు. నా కొడుకుని చివరికి పనిమనిషిని చేసారు కదా అంటూ కోపంగా అందరిని పిలుస్తాడు. సంతకం పేరుతో ఇలా చేస్తారా అని శివన్నారాయణతో శ్రీధర్ గొడవ పెట్టుకుంటాడు. నువ్వు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళమని శివన్నారాయణ అంటాడు . నా కొడుకుని నాతో పాటు పంపించే వరకు ఇక్కడే ఉంటానని నట్టింట్లో కూర్చుంటాడు శ్రీధర్. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి వెళ్లకపోతే చెల్లి, పిన్నికి కాల్ చేస్తానని కార్తీక్ బెదిరిస్తాడు. దాంతో శ్రీధర్ వెళ్లిపోతానంటాడు.

ఇప్పుడు వెళ్లిపోతున్నానని మీరు అనుకోకండి మళ్ళీ వస్తానంటూ శ్రీధర్ చెప్పి వెళ్లిపోతాడు. దీప వంట చెయ్ అని తనని కిచెన్ లోకి తీసుకొని వెళ్తాడు కార్తీక్. బావేంటి ఇంత హ్యాపీగా ఉన్నాడు .. అసలు వీళ్ళు ఏదో ప్లాన్ తోనే ఇక్కడికి వచ్చారని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు శ్రీధర్ ఇంటికి వెళ్లేసరికి స్వప్న, కాశీ భోజనం చేస్తుంటారు. శివన్నారాయణ ఇంటికి వెళ్లిన విషయం గురించి శ్రీధర్ ని కావేరి అడుగుతుంది. మీకెలా తెలుసు అని శ్రీధర్ అనగానే అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడని స్వప్న అంటుంది. నా కొడుకు ఆ ఇంట్లో అలా పని చెయ్యడానికి కారణం దీప అని శ్రీధర్ తిడతాడు. వాళ్ళు ఇంట్లో పని చెయ్యడం ఏంటని కాశీ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.