English | Telugu

Karthika Deepam 2 : ప్రాణాపాయ స్థితిలో దశరథ్.. పోలీస్ స్టేషన్ లో దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం' (karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -330 లో... దీప ఆవేశంగా జ్యోత్స్న దగ్గరికి రావడం తన పాలిట శాపంగా మారింది. జ్యోత్స్న వేసిన ప్లాన్ లో బలి పశువుగా మారింది దీప. జ్యోత్స్న గన్ పట్టుకొని చంపేస్తానని బెదిరించగా నేనే నిన్ను చంపేస్తానంటూ దీప గన్ తీసుకుంటుంది. అప్పుడే ఇంట్లో వాళ్ళు వస్తారు. నన్ను కాపాడండి అంటూ జ్యోత్స్న తన నటన మొదలుపెడుతుంది. గన్ దీప చేతిలో ఉంటుంది. అదుపు తప్పి దశరథ్ కి బుల్లెట్ గుండెల్లో గుచ్చుకుంటుంది. అందరు ఒక్కసారి షాక్ అవుతారు.

అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. అక్కడ జరుగుతున్న పరిస్థితి కార్తీక్ కి ఏం అర్ధం కాదు. దీపకి కూడా అక్కడున్నా పరిస్థితి ఏం అర్ధం కాదు. దశరథ్ ని ఆ సిచువేషన్ లో చూసి దీప దగ్గరికి వెళ్తుంది. సుమిత్ర దీప చెయ్ ని నెట్టేస్తుంది. దశరథ్ దగ్గరికి కార్తీక్ వెళ్ళబోతుంటే వద్దని శివన్నారాయణ చెప్తాడు. వీళ్ళ సంగతి తర్వాత చెప్దాము. ముందు దశరథ్ ని హాస్పిటల్ కి తీసుకొని వెళదామని శివన్నారాయణ అంటాడు. అప్పుడే పోలీసులు వచ్చి దీపని అరెస్ట్ చేస్తారు. దీప అరెస్ట్ ని కార్తీక్ ఆపాలని చూస్తాడు కానీ కుదరదు. మరొకవైపు కాంచన కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. శౌర్య, అనసూయ ఇద్దరు కాంచన కి ఏమైందని టెన్షన్ పడతారు. కళ్ళు తిరిగాయని కాంచన చెప్తుంది.

ఆ తర్వాత కార్తీక్ స్టేషన్ కి వెళ్తాడు. నువ్వేం చేసినా నాకు చెప్పాలి కదా.. ఇప్పుడు నిన్ను ఏం అనాలని దీపపై కార్తీక్ కోప్పడుతాడు. దీప మాత్రం సైలెంట్ గా ఉంటుంది. స్టేషన్ లో ఇన్‌స్పెక్టర్ దీప తప్పు చేసిందన్నట్టు మాట్లాడతాడు. అసలేం జరిగిందో తెలియకుండా మాట్లాడకండి అని పోలీస్ తో కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.