English | Telugu

 ష‌న్ను బండారం బ‌య‌ట‌పెట్టిన కాజ‌ల్‌

బిగ్‌బాస్ సీజ‌న్ 5 ముగిసినా దాని ర‌చ్చ ఇంకా కంటిన్యూ అవుతూనే వుంది. ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్జే కాజ‌ల్ తాజాగా ష‌న్నుబండారం బ‌య‌ట‌పెట్టింది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట‌ర్ కావ‌డ‌మే త‌న క‌ల‌గా భావించిన కాజ‌ల్ అనుకున్న‌ట్టుగాను హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి త‌న క‌ల‌ని నిజం చేసుకుంది. 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్న ఈ షోలో కాజ‌ల్ త‌న ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంద‌నే చెప్పాలి. ఎంత మంది త‌న‌ని హౌస్ నుంచి బ‌య‌టికి పంపించాల‌ని ప్ర‌య‌త్నాలు చేసినా టాప్ 6లో నిలిచి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

హౌస్ లో కాజ‌ల్ ని చాలా మంది చాలా ర‌కాలుగా ఆడుకున్నారు. యానీ మాస్ట‌ర్ అయితే త‌న‌ని నాగిన్ అంటూ ఏడిపించే ప్ర‌య‌త్నం చేసింది. ఇక ష‌న్ను ఏకంగా కాజ‌ల్ బ‌య‌టికి వెళితేనే హౌస్ లో గొడ‌వ‌లు త‌గ్గుతాయ‌ని స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు కూడా. ఇలా ర‌క ర‌కాల దాడుల త‌రువాత కాజ‌ల్ ఫైన‌ల్ గా స‌న్నీ, మాన‌స్ ల తో క‌లిసిపోయింది. ముందు ష‌న్నుతో క్లోజ్ గా వున్నా త‌ను క‌రెక్ట్ కాద‌ని తెలియ‌డంతో స‌న్నీ, మాన‌స్ ల తో గ్రూప్ క‌ట్టేసింది.

బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ చాలా మంది హౌస్ లో జ‌రిగిన విష‌యాల‌పై ఓపెన్ అవుతుంటే కాజ‌ల్ చాలా లేట్ గా రియాక్ట్ అయింది. ఈ సంద‌ర్భంగా ష‌ణ్ముఖ్ అస‌లు బండారం బ‌య‌ట‌పెట్టింది. హౌస్ లో ష‌న్ను ఎలా వుండేవాడు, త‌న‌తో ఏమ‌న్నాడు?.. ముందు త‌న‌తో వున్న కాజ‌ల్ ఎందుకు సన్నీ, మాన‌స్‌ల వ‌ద్ద‌కు చేరాల్సి వ‌చ్చిందో మొత్తానికి బ‌య‌ట‌పెట్టేసింది.

Also read:నెటిజ‌న్ ప్ర‌శ్న‌కి యానీ ఆన్స‌ర్ అదిరింది

నేను నా రియ‌ల్ లైఫ్ లో ఎలా వుండేదాన్నో హౌస్ లోనూ అలాగే వున్నాను. నాకు ఏది అనిపిస్తే అదే చేశా. ష‌ణ్ముఖ్ కు ఫాలోయింగ్ వుంద‌ని అత‌న్ని ముందు ఫాలో కాలేదు. స్టార్టింగ్ లో అలా క‌నెక్ట్ అయ్యా. అప్పుడు ష‌న్ను ఏమ‌న్నాడంటే .. నువ్వు వుంటే నాతో మాత్ర‌మే వుండాలి.. అంద‌రితో ఉంటూ నాతో వుంటే నాకు ఇష్టం వుండ‌దు.. దాన్ని నేను తీసుకోలేను.. నువ్వు నాతోనే వుండాలి అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అది నాకు న‌చ్చ‌లేదు. నాకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ వుంది. కాబ‌ట్టే అత‌నికి దూరంగా వున్నాను` అంటూ ష‌న్ను బండారం బ‌య‌ట‌పెట్టింది కాజ‌ల్‌.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.