English | Telugu

రష్మిక ఈ దేశానికే గర్ల్ ఫ్రెండ్!

రష్మిక మందన్న వుంటే చాలు ఆ మూవీ హిట్ అన్న నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. అందుకే ఇప్పుడు ఏ మూవీలో చూసినా రష్మిక మస్ట్ గా కనిపిస్తోంది. రీసెంట్ గా గర్ల్ ఫ్రెండ్ మూవీలో కూడా నటించింది. ఇక డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్, హీరోయిన్ రష్మిక కలిసి జయమ్ము నిశ్చయమ్మురా షోకి వచ్చి వాళ్ళ మూవీ గురించి చెప్పుకొచ్చారు.

"రష్మిక గర్ల్ ఫ్రెండ్ స్క్రిప్ట్ కోసం ఎలా పని చేయాలి, ఎలా ప్రెజెంట్ చేయాలి అనే దాని కోసమే కష్టపడింది తప్ప నేను యానిమల్ మూవీ చేసాను, పుష్ప మూవీ చేసాను, నేను పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ చేసాను. నేను పెద్ద హీరోయిన్ ని అని ఒక్కసారి కూడా ఆవిడ నోటి నుంచి ఇలాంటి మాటలు నేను వినలేదు. కంట్రీ మొత్తం ఆమె ట్రావెల్ చేస్తూ ప్రతీ రోజూ గర్ల్ ఫ్రెండ్ మూవీలో తన రోల్ కోసం వాయిస్ మెసేజెస్ పెట్టమని రోల్ కి సంబంధించి స్క్రిప్ట్ పంపమని అడిగి ప్రిపేర్ అవుతూ ఉండేది. ఇంత కంఫర్ట్ మనకు యాక్టర్ ఇస్తున్నప్పుడు ఆ ప్రెజర్ డైరెక్టర్ మీద ఎక్కువగా ఉండదు. అందుకే నేను కూడా ఒక్కటే అనుకున్నా ఈ క్యారక్టర్ ని ఆమె ఎలా చేయాలో చెప్తూ ఉండేవాడిని. రోజూ సెట్ కి ఒక కొత్త అమ్మాయిలా అప్పుడే నేర్చుకుంటున్న అమ్మాయిలా వచ్చి అన్ని తెలుసుకునేది. ఆమె సోలో రోల్ లో కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తుంది. అలాగే ఆమెతో సోలో రోల్ లో నటించేలా చేసిన ఫస్ట్ డైరెక్టర్ ని నేనే" అంటూ చెప్పుకొచ్చారు గర్ల్ ఫ్రెండ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్.

"మాకు అవకాశాలు ఇంకా పెరగాలి. మాకోసం కూడా స్క్రిప్ట్స్ రాయాలి..ఆడియన్స్ సపోర్ట్ చేయాలి..అవకాశం వచ్చినప్పుడే మాలో టాలెంట్ ని షోకేసు చేసుకోగలుగుతాం" అని రష్మిక చెప్పింది. ఇక జగపతి బాబు ఐతే "ఒక్క రష్మికాకు, రాహుల్ కె కాదు దేశానికే గర్ల్ ఫ్రెండ్" అని రష్మికకి కితాబిచ్చారు.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.