English | Telugu
హై రేంజ్ లో హైపర్ ఆది సంపాదన.. రీసెంట్ గా కొన్న ఆస్తులు తెలిస్తే షాక్!
Updated : Nov 6, 2021
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షోలో తన పంచ్ లు, కామెడీ టైమింగ్ తో తక్కువ టైంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది.. పలు టీవీ షోలు, సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తక్కువ టైంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న ఆది.. సంపాదన విషయంలోనూ తక్కువ టైంలోనే బాగా వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.
టీవీ షోలు, ఈవెంట్ లకు ఆది రెమ్యునరేషన్ భారీ గానే ఉంటుందని టాక్. జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి లక్షల్లో రెమ్యునరేషన్ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈవెంట్స్ లో కూడా.. ఈవెంట్ రేంజ్ ని బట్టి ఆది రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తాడట. ఇలా టీవీ షోలు, ఈవెంట్ లు, సినిమాలు కలిపి ఆది సంపాదన ఏడాదికి కోటి రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం.
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లుగా.. ఆది ఫేమ్ ఉండగానే బాగా సంపాదిస్తున్నాడట. అంతేకాదు ఆ సంపాదనని వృధా ఖర్చు చేయకుండా ముందు చూపుతో ప్రాపర్టీస్ కొంటున్నాడట. ఇప్పటికే సొంత ఊళ్ళో 16 ఎకరాల పొలం కొన్న ఆది.. తాజాగా హైదరాబాద్ లో ఒక ప్లాట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.