English | Telugu

Illu illalu pillalu : భాగ్యం పికిల్స్ బిజినెస్ కి బ్రేక్.. ప్రేమకు సర్ ప్రైజ్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -316 లో.. భాగ్యం వాళ్ళు రామరాజు దగ్గర డబ్బు తీసుకోవాలని ప్లాన్ చేస్తారు. ప్లాన్ లో భాగంగా.. మేమ్ భాగ్యం పికిల్స్ స్టార్ట్ చేస్తున్నాము.. దానికి ఇరవై అయిదు లక్షలు కావాలి.. మీరే అన్నయ్య గారితో చెప్పి ఇప్పించండి అని వేదవతితో భాగ్యం చెప్తుంది. అంత డబ్బు ఎందుకని నర్మద అడుగుతుంది. అంటే మేమ్ మొదలుపెట్టేది చిన్న బిజినెస్ కాదు కదా అని భాగ్యం అంటుంది.

మీరు చెయ్యాలనుకుంటున్నాను.. పికిల్ ఒకసారి ఇప్పుడు చెయ్యండి.. మావయ్య టేస్ట్ చేసి.. మీకు డబ్బు ఇస్తారని ప్రేమ, నర్మద అంటారు. అందులో ఏముంది.. ఇప్పుడే చేస్తామని మ్యాంగో పికిల్ స్టార్ట్ చేస్తారు. అప్పుడే ప్రేమ, నర్మద వచ్చి వాళ్ళని మాటల్లో పెట్టి వాళ్ళు పెట్టిన పికిల్ లో ఉప్పు వేస్తారు. ఆ తర్వాత ఇందులో ఉప్పు వెయ్యలేదని మళ్ళీ భాగ్యం వేస్తుంది. ఆ తర్వాత టేస్ట్ చూస్తానని భాగ్యం అంటుంది. వద్దు నువ్వు కళ్ళు మూసుకొని ఉప్పు వేస్తావ్.. అలాంటిది ముందే టెస్ట్ చేస్తే నీ వంటకే అవమానం అని ఆనందరావు అడ్డుపడతాడు. ఆ తర్వాత రామరాజు వచ్చి భోజనం చేస్తుంటే భాగ్యం పికిల్ పట్టుకొని వస్తుంది. దాంతో జరిగింది మొత్తం వేదవతి చెప్తుంది. మీరు డెవలప్ అవుతానంటే నా రైస్ మిల్ షూరిటీ పెడుతానని రామరాజు అంటాడు. అయితే ఈ పికిల్ టేస్ట్ చెయ్యండి అని భాగ్యం అంటుంది. రామరాజు, చందు, తిరుపతి అది తిని వాంథింగ్ చేసుకుంటారు. మీ వల్ల ఈ పికిల్ బిజినెస్ అవ్వదని రామరాజు అంటాడు.

అన్యాయంగా డబ్బు సంపాదించాలనుకుంటే ఇలాగే అడ్డుపడుతామని నర్మద, ప్రేమ ఇద్దరు వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు. దగ్గరదాకా వరకు వచ్చిన డబ్బు లాగేస్తారా అని భాగ్యం అనుకుంటుంది‌. ఆ తర్వాత ప్రేమ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే నీకు సర్ ప్రైజ్ అంటూ ప్రేమని కార్ ఎక్కించుకుంటాడు ధీరజ్. తరువాయి భాగంలో ప్రేమ రన్నింగ్ చెయ్యడానికి షూస్ కావాలని.. షూస్ కొనడానికి తనని షాప్ కి తీసుకొని వెళ్తాడు ధీరజ్. ఇక అక్కడ షూస్ తీసుకొని స్వయంగా ప్రేమ కాలికి షూస్ వేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.