English | Telugu

Illu illalu pillalu : శోభని బలవంతంగా తీసుకెళ్లిన తన ఫ్రెండ్స్.. ధీరజ్ కాపడగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -296 లో.....శ్రీవల్లి బట్టలు ఆరెస్తూ.. ఈ అమూల్య నా గురించి ఆ ప్రేమకి చెప్పినట్లుంది.. ఇప్పుడు ఆ ప్రేమ నన్ను ఏం అడుగుతుందోనని టెన్షన్ పడుతుంది. అప్పుడే ప్రేమ పక్కన వచ్చి నిల్చుంటుంది. దాంతో శ్రీవల్లి టెన్షన్ పడుతూ లోపలికి వెళ్తుంది. అక్కడికి కూడా ప్రేమ వెళ్తుంది. అమూల్యని జాతర లో ఎందుకు వదిలేసి వెళ్లావని ప్రేమ అడుగుతుంది. జాతర అంతా చూడమని వెళ్ళానని శ్రీవల్లి చెప్తుంది.

దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందని తెలిస్తే మాత్రం ఊరుకోనని శ్రీవల్లికి ప్రేమ వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు శోభ తన ఫ్రెండ్స్ తో టూర్ కి వెళ్తుంది. గౌతమ్ వాళ్ళు ఎక్కడ అని శోభ తన ఫ్రెండ్స్ అయిన బాయ్స్ ని అడుగుతుంది. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారని అబద్దం చెప్తారు. శోభతో వాళ్ళు తప్పుగా బెహేవ్ చేస్తూ ఉంటే అది ధీరజ్ చూసి కార్ ఆగిపోయినట్లు అబద్ధం చెప్తాడు. ఆ ఇద్దరు బాయ్స్ ని కార్ తోయమంటాడు ధీరజ్. వాళ్ళు తొయ్యగానే ధీరజ్ ఆ అమ్మయితో కలిసి వెళ్ళిపోతాడు. వాళ్ళని చుస్తే డౌట్ గా ఉంది. అందుకే అలా చేసానని ధీరజ్ చెప్పగానే థాంక్స్ అన్నయ్య నేను ఇంటికి వెళ్తానని కార్ దిగుతుంది. ఆ తర్వాత కాసేపటికి శోభని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి బలవంతంగా కార్ లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు.

ఆ తర్వాత ప్రేమ డ్రింక్ చేసి మళ్ళీ నన్ను ఎక్కడ కొడుతుందోనని శ్రీవల్లి ఇంట్లో ఉన్న మందు బాటిల్స్ అన్నీ దాచేస్తుంది. మరోవైపు తిరుపతి, రామరాజు డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.