English | Telugu

Illu illalu pillalu: బెల్లం కాఫీతో అందరిని ఇంప్రెస్ చేసిన శ్రీవల్లి.. భాగ్యం ప్లాన్ అదుర్స్ !

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-141లో.. రామరాజు మార్నింగ్ వాక్‌కి వెళ్తుంటాడు. ఇంతలో శ్రీవల్లి.. అందరికీ కాఫీ ఇచ్చి.. మాయ గారు గుడ్ మార్నింగ్ అండి అని పలకరించి కాఫీ ఇవ్వబోతుంది. నేను వాకింగ్ చేసొచ్చాక తాగుతానమ్మా అని రామరాజు అంటాడు. అయ్ బాబోయ్.. ఖాళీ కడుపుతో వాకింగ్ చేస్తే నీరసం వచ్చేయదూ.. అట్టా ఎప్పుడూ చేయొద్దు.. మంచిది కాదు.. ఒక్క కాఫీ కడుపులో పడితే పడి ఉంటుంది కదా అని శ్రీవల్లి అంటుంది. దాంతో రామరాజు సరేనని కాఫీ తీసుకుంటాడు. ఏంటి బుజ్జమ్మా.. కొత్త కోడలికి అప్పుడే పనులు చెప్తున్నావా అని రామరాజు అంటాడు. శ్రీరామా.. శ్రీరామా.. నేను పనులు చెప్పడం ఏంటండీ.. మీ కొత్త కోడలే మాకు ఉదయాన్నే షాకిచ్చింది. నాలుగింటికే లేచి.. మేం ముగ్గురం చేసే పనులన్నీ తను ఒక్కతే చేసేసింది.. మేం లేచేసరికి వేదవతి అంటుంది.

దాంతో రామరాజు తెగ మురిసిపోతూ.. ఆడపిల్లకి గుణాన్ని మించిన ఆస్తి మరోటి లేదంటారు. ఆ మాట అక్షరాలా నిజమని నిరూపించావ్ అమ్మా.. మా పెద్దోడు ఎలాంటి రావాలని కోరుకున్నానో.. ఆ లక్షణాలన్నీ నీలో ఉన్నాయ్.. మా పెద్దోడు జీవితం గురించి నాకు ఎలాంటి దిగులు లేదంటూ రామరాజు అంటాడు. ఒకరి తరువాత ఒకరు కాఫీ రుచి చూసి.. ఆహా అద్భుతమని అంటారు. అబ్బబ్బా టేస్ట్ అదిరిపోయింది వదినా అని ధీరజ్ అనడంతో.. ఇదీ తాటి బెల్లం కాఫీ మరిదిగారూ.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని శ్రీవల్లి అంటుంది. కాఫీ టేస్ట్ చేసిన సాగర్.. ఇదిగో నర్మదా.. కాఫీ ఎలా పెట్టాలో మా వదినను చూసి నేర్చుకోమని అంటాడు. ఇక సాగర్ దగ్గరకు నర్మద వచ్చి.. ఏంటీ నేను కాఫీ పెట్టడం నేర్చుకోవాలా.మ రోజూ నేను పెట్టిన కాఫీ తాగి.. అంత మాట అంటావా.. ఇది బాగుందని అంటున్నావంటే.. నేను పెట్టిన కాఫీ బాలేదనే కదా అంటూ కాలర్ పట్టుకుని ఊపిపారేస్తుంది. దాంతో సాగర్ అక్కడ నుంచి పారిపోతాడు.

ఇక కాసేపటికి రామరాజు ఇంటికి భాగ్యం బ్యాగులతో వస్తుంది. వచ్చీ రాగానే తన కూతురు శ్రీవల్లి గురించి అడిగి తెలుసుకుంటుంది. ఇక తనకి ఇంకా గది ఇవ్వలేదని శ్రీవల్లి తన తల్లి భాగ్యంకి చెప్తుంది. దాంతో భాగ్యం తన మాటలతో అందరిని ఇరకాటంలో పడేస్తుంది. రామరాజు తన గది ఇస్తానంటే ధీరజ్ అడ్డుపడి తమ గదిని ఇస్తానంటాడు. అలా శ్రీవల్లికి భాగ్యం గదిని ఇచ్చేలా చేస్తుంది. చూసావా ఎలా సాధించానో అని భాగ్యం శ్రీవల్లితో అనగానే ఇకమీదట నువ్వు ఎలాగంటే అలాగే ఉంటానమ్మా అంటు శ్రీవల్లి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.