English | Telugu

illu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లాంఛ్ ఎపిసోడ్ ఎలా ఉందంటే!

ఒక కుటుంబం గొప్పతనం.. బంధాలు.. బంధుత్వాలు తెలియజేస్తూ కొత్త సీరియల్ స్టార్ మా టీవీలో మొదలైంది. ఒకే కుటుంబంలోని అక్కాచెల్లెళ్ళు దూరమైతే కుటుంబంలోని ఆ వారు ఎంత బాధపడుతారో కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సీరియల్ ఎపిసోడ్ -01లో ఏం జరిగిందో చూసేద్దాం.

ఒక ఊరిలో పేరు ప్రతిష్టలు ఉన్న ఒక పెద్దాయన ఉంటాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉంటారు. ఇద్దరు అక్కచెల్లెల్లలో.. అక్క భద్రావతి.. చెల్లి వేదవతి.. చిన్నప్పటి నుండి ఇద్దరు ప్రాణంగా ఉంటారు. రోజు ప్రొద్దున లేచి వేదవతి మొహం చూస్తుంది భద్రావతి. చెల్లి అంటే భద్రావతికి అంత ప్రేమ ఉంటుంది. ఆ తర్వాత రామరాజు వాళ్ళ ఇంట్లో ఉంటున్న నమ్మకమైన పనివాడు అతనికి వాళ్ళు తప్ప ఎవరు ఉండరు.

ఆ తర్వాత ఇద్దరు అక్కాచెల్లెలు కొలనులో దీపాలు వదులుతారు. వేదవతి తను ప్రేమించిన అబ్బాయి తో పెళ్లి జరగాలని మొక్కుకుంటుంది‌. దీపం కొండెక్కుతుంటే రామరాజు వచ్చి.. మీరు కోరుకున్న కోరిన నెరవేరుతుంది. ఈ దీపం కొండేక్కదని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరికి పెళ్లి చెయ్యాలని ఇద్దరిని ఒక ఇంటికి ఇవ్వాలనుకుంటారు. పెళ్లి అయితే ఎక్కడ చెల్లి నేను విడిపోతామోనని అనుకున్నాను.. ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటామని భద్రావతి సంతోషపడుతుంది. సీన్ కట్ చేస్తే వేదవతి, రామరాజులు పెళ్లి చేసుకుంటారు. అక్కడికి వేదవతి కుటుంబం వచ్చి రామరాజుని అవమానిస్తారు. ఇంట్లో పనివాడివి అంటారు. ఎప్పుడు అయితే పని వాడితో లేచిపోయిందో అప్పుడే అది మనకి లేదని భద్రావతి అంటుంది. దూరం గా వెళ్ళాలి అనుకుంటారు కానీ ఇక్కడే ఉంటే మీ వాళ్లని చూసుకుంటావ్ కదా అని వేదవతితో రామరాజు అంటాడు.

ఆ తర్వాత భద్రావతికి సంబంధం వస్తుంది‌ మీ చెల్లి పనివాడితో లేచిపోయిందట.. నీకు అలాంటిది ఉంటే చెప్పమని అబ్బాయి అనగానే.. తనని కొట్టి భద్రావతి పంపిస్తుంది. ఆ తర్వాత పెళ్లి చూపులకి వచ్చిన వాళ్ళు వెళ్తుంటే రామరాజు ఆపి వాళ్ళు చాలా మంచి వాళ్లు అని వాల్ల కాళ్ళు పట్టుకొని పెళ్లి చేసుకొమ్మంటాడు. అయిన వాళ్ళు వెళ్ళిపోతారు. అదంతా చుసిన వేదవతి వాళ్ల నాన్న.. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను.. అని రామరాజుని హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత వేదవతి దగ్గరికి వాళ్ళ నాన్న వెళ్తాడు. పెద్దాయన ఇంటికి వచ్చి రామరాజుని అల్లుడుగా ఒప్పుకొని ఇంట్లోకి పిలుద్దామని అంటాడు. అందుకు భద్రావతి ఒప్పుకోదు.. వాడు చచ్చిన రోజు నేను పెళ్లి చేసుకుంటా వాడిని క్షమించేది లేదు.. నా చెల్లి నా గుండెచప్పుడు అలాంటిది నా నుండి నా చెల్లిని దూరం చేసాడని భద్రావతి కోపంగా మాట్లాడతుంది. ఆ తర్వాత పెద్దాయన తన భార్యతో చెప్తూ బాధపడుతాడు. అప్పుడే చనిపోతాడు. ఇక వేదవతి, రామరాజులు వస్తుంటే.. వద్దని తన తమ్ముడు సేనాపతికి భద్రావతి చెప్పగానే డోర్ వేస్తాడు. మా నాన్నని చూస్తానంటూ వేదవతి ఏడుస్తుంటే.. రామరాజు కత్తి పట్టుకొని డోర్ నెట్టి వేదవతిని లోపలికి తీసుకొని వెళ్తాడు. నాన్న చావుకి కారణమైన నిన్ను వదలనురా అని భద్రావతి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.