English | Telugu

పూర్ణ ముద్దులకు న‌రేశ్ అల‌వాటు ప‌డ్డాడా?

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఈవారం అందరినీ అలరించింది. ఇందులో నాటీ నరేష్ డాన్స్ హైలైట్ గా నిలిచింది. తన లవ్ ఫెయిల్యూర్ అంశాన్ని తీసుకుని స్కిట్ కం డాన్స్ రూపంలో తన బాధ చెప్పేసరికి అందరూ ఎమోషన్ అయ్యారు. తర్వాత సదా "చాలా బాగా చేసాడని" కాంప్లిమెంట్ ఇచ్చింది. నరేష్ ని పిలిచి హగ్ చేసుకుని ముద్దులిచ్చేసింది పూర్ణ‌. తర్వాత పవిత్ర స్టేజి మీదకు వచ్చి "ఆ డాన్స్ న‌న్ను బాగా కదిలించింది" అని చెప్పింది.

తాను జబర్దస్త్ కి రాకముందు బయట జాబ్స్ చేసే టైములో అందరూ పొట్టి పొట్టి అని ఏడిపించే వారని గుర్తుచేసుకుని బాధపడింది పవిత్ర. తర్వాత ఆది, "పవిత్రా! ఏం చెప్పాలనుకున్నావో నీ మనసులో ఉన్న మాటను ఈరోజు నరేష్ కి చెప్పేయ్. ఎందుకంటే రేపటి నుంచి నిన్ను, నరేష్ ని స్కిట్ లో ఉంచుతారో లేదో తెలీదు" అంటూ కామెడీ చేశాడు.

నరేష్ ముఖాన్ని చూసి "వాడు భయపడుతున్నాడు" అంది ప‌విత్ర‌. "వాడు పూర్ణ ముద్దులకు అలవాటు పడ్డాడు కదా అలాగే ఉంటాయి ఎక్స్ప్రెషన్స్.. కానీ.. నువ్వు చెప్పేయ్" అనేసరికి, "పవిత్ర , నరేష్ ఇద్దరూ డాన్స్ చేస్తే బాగుంటుంది" అంది పూర్ణ.. "అందం అమ్మాయితే" అనే పాటకు నరేష్ ని ఎత్తుకుని డాన్స్ చేసింది ప‌విత్ర‌. అది చూసి, "ఒక తల్లి తన పిల్లాడిని ఆడించినట్టు ఉందిరా" అంటూ కౌంటర్ వేశాడు ఆది.

"వాళ్ళు కుళ్లిపోతున్నారులే నరేష్ వాళ్లకు ఎప్పుడూ ఇలా జరగలేదని" అని రష్మీ అన‌డంతో, "నాకు పవిత్ర ఉంది. నీకెవరున్నారు?" అంటూ రెచ్చిపోయి ఆదికి రివర్స్ కౌంటర్ వేశాడు నరేష్. "నువ్వు గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు.. నాకెవరు లేరు" అని ఆది అడిగేసరికి "సెట్టు మొత్తం నీ వెనకే ఉంది" అంటూ నవ్వేశాడు నరేష్.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.