English | Telugu

గ్రాండ్ ఫినాలే టీఆర్పీ ఇంతొచ్చిందా?

బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఇటీవ‌లే ముగిసిన విష‌యం తెలిసిందే. గ‌త సీజ‌న్‌ల‌తో పోలిస్తే ఈ సీజ‌న్ స‌ప్ప‌గా సాగింద‌ని విమ‌ర్శ‌లు వినిపించాయి. అయితే ఫైన‌ల్ గా ఈ సీజ‌న్ గ్రాండ్ ఫినాలేలో స‌న్నీ విజేత‌గా నిలిచి దాదాపు కోటి రూపాయ‌ల ప్రై స‌న్నీద‌క్కించుకున్నాడు. 50 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీతో పాటు 25 ల‌క్ష‌ల విలువ చేసే ఇంటి స్థ‌లం.. 15 వారాల రెమ్యున‌రేష‌న్ వెరసి వీజే స‌న్నీకి కోటికి మించి అందిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ఈ సీజ‌న్‌కి సంబంధించిన తాజ‌గా మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త చక్క‌ర్లు కొడుతోంది.

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన ఈ షో గ్రాండ్ ఫినాలే రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకుంద‌ని తెలుస్తోంది. సీజ‌న్ 5 గ్రాండ్ ఫినాలే గ‌త సీజన్ ల‌కు పూర్తి భిన్నంగా సాగింది. గ్రాండ్ ఫినాలే రోజు హౌస్ లో మొత్తం ఐదుగురు స‌భ్యులున్నారు. స‌న్నీ, ష‌ణ్ముఖ్, మాన‌స్‌, శ్రీ‌రామ్, సిరి. ఈ ఐదుగురిలో సిరి ఎలిమినేట్ కావ‌డం తెలిసిందే. ఆ త‌రువాత మాన‌స్‌, శ్రీ‌రామ్ ఎలిమినేట్ అవుతూ వ‌చ్చారు. చివ‌రికి స‌న్నీ, ష‌ణ్ముఖ్ ఇద్ద‌రు మాత్ర‌మే ఫైన‌ల్ కు చేరుకున్నారు.

ఫైన‌ల్ గా వీజే స‌న్నీ విజేత‌గా నిలిచాడు. అయితే ఆరోజు జ‌రిగిన గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కి ప్ర‌ధానంగా ఛీఫ్ గెస్ట్ అంటూ ఎవ‌రూ హాజ‌రు కాక‌పోయినా షోకు భారీ స్థాయిలో టీఆర్పీరేటింగ్ రావ‌డం గ‌మ‌నార్హం. ఈ షోలో అతిథులుగా రాజ‌మౌళి, ర‌ణ్ బీర్ క‌పూర్‌, అయాన్ ముఖ‌ర్జీ, అలియా భ‌ట్ పాల్గొని సంద‌డి చేశారు. నాగ‌చైత‌న్య‌, నాని, సాయి ప‌ల్ల‌వి, కృతిశెట్టి తో పాటు హౌస్‌లోకి రాగా.. మ‌రి కొంత మంది త‌మ డ్యాన్సుల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో ఈ షో టాప్ హిట్ గా నిలిచింది. టీఆర్పీ రేటింగ్ 18.4గా న‌మోదైంద‌ని, ఈ షో గ్రాండ్ ఫినాలేని 6.2 కోట్ల మంది వీక్షించార‌ని, 4. 5 గంట‌ల పాటు షో సాగింద‌ని `స్టార్ మా` సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.