English | Telugu

ఎవరికీ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలీదా ? జర్నలిస్ట్ పై గెటప్ శీను ఫైర్

జబర్దస్త్ షో ద్వారా.. ఆ స్టేజి మీదే ఓనమాలు దిద్దిన ఎంతో మంది ఇప్పుడు సెలబ్రిటీలుగా ఎదిగారు. వీళ్లు ఈ షోతో పాటుగా స్పెషల్‌ ఈవెంట్స్‌, స్కిట్లు కూడా చేస్తుంటారు. ఇక ఇప్పుడు వినాయకచవితి సందర్భంగా ‘మన ఊరి దేవుడు’ అనే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో 3 రిలీజ్ అయ్యింది. తాజాగా విడుదలైన ప్రోమోలో యాంకర్‌ రోషన్‌ సందడి చేశారు. ఈ షో లో రోషన్ జబర్దస్త్ కమెడియన్స్ ని ఇంటర్వ్యూ చేశారు. కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా రోషన్ వాళ్ళను అడిగాడు వాళ్ళు కూడా అతన్ని ప్రశ్నించారు. "జబర్దస్త్ లో అసలు ఏం జరుగుతోంది అనేసరికి అది మాకంటే మీకే బాగా తెలుసు" అంటూ ఆది పంచ్ వేసాడు. "మీరు ఇంత సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ కావడానికి కారణం అని రోషన్ అడిగేసరికి నా పక్క ఆర్టిస్టులు సరిగా చేయక నాకు పేరొచ్చింది" అంటారు కృష్ణ భగవాన్.

"మనిషిగా ఎదగాలంటే దానికి మీరు చెప్పే సూత్రం ఏమిటి అని అడిగేసరికి ఎవడికి బడితే వాడికి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని" చెప్పేసరికి..ఇదంతా సీరియస్ గా గమనిస్తున్న గెటప్ శీను వచ్చి " ఏజ్ పరంగా మీరు ఎవరికీ రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎందుకు మాట్లాడతారు ? అనేసరికి రోషన్ ఫేస్ మాడిపోతుంది. మీడియాలో ఉన్న జర్నలిస్ట్ గా ఉన్నాను కాబట్టి ప్రతీ సారి గారు, గారు అనలేం కదా అంటూ ఆన్సర్ ఇచ్చాడు. ఇది షో అని శీను అనేసరికి మీకు షో కావొచ్చు కానీ ఇది నా షో అని చెప్పారు" అంటాడు రోషన్ . ఇలా ఇద్దరి మధ్య డిస్కషన్ సీరియస్ గా తారాస్థాయికి చేరింది. ఇంతకు ఎవరు ఎలాంటి పంచ్ డైలాగ్స్ వేసుకున్నారు అనే విషయం తెలియాలంటే ఈ షో చూసేయాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.