English | Telugu

Jayam Serial: పారు వేసిన ప్లాన్ లో రుద్ర బలి కానున్నాడా.. గంగ ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం(Jayam)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-187 లో.. రుద్ర, పారు అకాడమీ పని మీద సిటీ అవుట్ స్కర్ట్స్ లో ఉన్న ఒక రెసాట్ కి వెళ్తారు. అక్కడే ఒక రోజు ఉండాలని ఇంటికి కాల్ చేసి చెప్తాడు రుద్ర. దాంతో గంగ టెన్షన్ పడుతుంది. ఈ రోజు అక్కడే ఉంటారంటా ఇద్దరు అని గంగ అందరితో చెప్తుంది. అప్పుడే శకుంతల వస్తుంది.

ఆ మాత్రం దానికి అంత ఏడుపు మొహం పెట్టి చెప్పాలా.. వర్క్ మీదనే కదా అక్కడికి వెళ్ళింది.. దానికి అంత ఏడ్వాల్సిన పని లేదు..ఇక్కడ ఏడిస్తే అక్కడ పనులు కూడా ఏడ్చినట్టే జరుగుతాయని శకుంతల అంటుంది. మీరు వెళ్ళి భోజనం చేయండి అని వీరు భార్య అనగానే సరేనని శకుంతల లోపలికి వెళ్తుంది. అది చూసిన ఇషిక, వీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. పారు గట్టిగానే ప్లాన్ చేసింది కదా బ్రో అని ఇషిక అనగానే.. ఇది తనకి గోల్డెన్ ఛాన్స్ అని వీరు అంటాడు. లెట్స్ సీ హర్ సక్సెస్ అంటూ ఇషిక అంటుంది. ఇక పారు గురించి గంగ టెన్షన్ పడుతుంది. నా భర్త బంగారం కానీ ఆ పారునే నమ్మడానికి లేదని గంగ అంటుంది. కాసేపు కళ్ళు మూసుకుంటుంది గంగ. అప్పుడే అక్కడ దూరంలో ఉన్న గంగ, రుద్ర ఇద్దరు రొమాంటిక్ ఉన్నట్టుగా కల వస్తుంది గంగకి. వెంటనే నహీ.. లేదు.. అలా జరుగకూడదని గంగ ఉలిక్కిపడి లేస్తుంది. ఆ తర్వాత వంశీ, సూర్య వాళ్ళంతా ఏమైందని అడుగుతారు‌. వాళ్ళిద్దరు రొమాంటిక్ గా ఉన్నారని కల వచ్చిందని చెప్తుంది గంగ.

ఇక్కడ ఉండి టెన్షన్ పడే బదులు అక్కడికి వెళ్తే సరిపోతుంది కదా అని వంశీ ఐడియా ఇస్తాడు. అవును కదా అని గంగ అనుకుంటుంది. మరి నేనొక్కదాన్నే ఎలా వెళ్ళడం అని గంగ అంటుంది. ఒక్కదానివే ఎలా వెళ్తావ్.. ఐడియా ఇచ్చింది వంశీనే కాబట్టి అతనే తీసుకెళ్తాడని సూర్య చెప్తాడు. మరోవైపు పారు, రుద్ర రెసాట్ లో వేరు వేరు గదులలో ఉంటారు. రుద్రకి పారు కాల్ చేసి భోజనం ఆర్డర్ చేసాను.. లైట్ గా తినేసి వెళ్ళి పడుకోమని పారు చెప్పగానే సరేనని రుద్ర అంటాడు. ఆ తర్వాత డోర్ లాక్ వేసేలా చేస్తుంది‌ పారు. ఇక రుద్ర లోపలికి వచ్చాక ఇద్దరు భోజనం చేస్తారు. కాసేపటికి రుద్ర వెళ్దామని డోర్ తీస్తే అది లాక్ అయి ఉంటుంది. ఇక చేసేదేమీ లేక తన గదిలోనే ఉండిపోతాడు రుద్ర. ఇక జ్యోత్స్న రెసాట్ రిసెప్షన్ కి కాల్ చేసినట్టు యాక్ట్ చేస్తుంది‌‌. ఆ తర్వాత ఒక కూల్ డ్రింక్ లో మత్తు మందు ట్యాబ్లెట్లు వేస్తుంది పారు. అది తీసుకెళ్ళి రుద్రకి ఇస్తుంది. మరి రుద్ర ఆ కూల్ డ్రింక్ తాగుతాడా.‌‌.పారు వేసిన ప్లాన్ లో రుద్ర బలి కానున్నాడా.. గంగ ఏం చేయనుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu: శ్రీవల్లిని ఏకిపారేసిన నర్మద, ప్రేమ.. స్పృహలోకి వచ్చిన రామరాజు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu )'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-388 లో.. అమూల్యతో ప్రేమ, నర్మద మాట్లాడతారు. శ్రీవల్లి చేసిన పనికి అసలు వదలకూడదని ప్రేమ అంటుంది. నాకు మాటిచ్చారని అమూల్య అనగానే అది తిన్నింటి వాసాలు లెక్కపెట్టి నీ జీవితం నాశ చేస్తే ఇంకా మాటని పట్టుకొని వేలాడటం ఏంటి అమూల్య అని ప్రేమ కోపంగా అంటుంది. ఇప్పుడు నిజం చెప్తే శ్రీవల్లి వదిన జీవితం నాశనం అవుతుంది‌. నాన్న ఏరి కోరి తెచ్చిన సంబంధం.. తను ఇలా చేసిందంటే నాన్న తట్టుకోగలడా అని అమూల్య అంటుంది. 

Brahmamudi : చక్రవర్తిని కాపాడిన రాజ్.. గడువులోగా మినిస్టర్ నిజం చెప్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -948 లో..... మినిస్టర్ కి రాజ్ ఫోన్ చేస్తాడు‌. డాక్టర్ చక్రవర్తిని తీసుకొని నీ భార్య దగ్గరికి వెళ్తున్నాను.. అతను నీ గురించి నిజం చెప్పేస్తాడని రాజ్ అంటాడు.  రాజ్ అలా అనగానే మినిస్టర్ భయపడతాడు. చక్రవర్తి ని దాచిన ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ చక్రవర్తిని చూసి రిలాక్స్ అవుతాడు. అప్పుడే రాజ్ ఫోన్ చేసి నా ప్లాన్ చేంజ్ చేసుకున్నాను.. నీకు హెల్ప్ చేసిన నర్సు నీలవేణి దగ్గరికి వెళ్లి సాక్ష్యం సంపాదిస్తానని రాజ్ అనగానే మళ్ళీ  నీలవేణి దగ్గరికి వెళ్తాడు మినిస్టర్.