English | Telugu

Eto Vellipoyindhi Manasu : భార్య పంపిన విడాకుల పత్రాలు చూసి భర్త షాక్.. అత్త ప్లాన్ సక్సెస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -263 లో.....శ్రీలత, శ్రీవల్లిలు సీతాకాంత్ రావడం గమనించి.. తమ నటనని మొదలు పెడతారు. శ్రీవల్లి ఏడుస్తుంటే.. సీతాకాంత్ ఏమైందని అడుగుతాడు. ఎలా ఉండే అత్తయ్య ఎలా అయ్యారు చూడండి బావగారు అంటూ శ్రీలత నేలపైన పడుకున్న శ్రీలతని చూపిస్తుంది. శ్రీలత దగ్గరికి సీతాకాంత్ వెళ్ళగానే.. ఎప్పుడు వచ్చావ్ సీతా అంటూ నటిస్తుంది. రామలక్ష్మి అక్క వళ్లే అత్తయ్యకి ఈ పరిస్థితి అని శ్రీవల్లి అంటుంది.

దాంతో కోపంగా సీతాకాంత్ రామలక్ష్మి దగ్గరికి వెళ్లి.. నీకు ఈ భోగభాగ్యాలు సరిపోతాయా.. మా అమ్మని మహారాణిలా చూసుకోవాలనుకున్నాను కానీ ఇలా చేస్తావనుకోలేదు.. నిన్ను పెళ్లి చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు అంటూ సీతాకాంత్ అనగానే రామలక్ష్మి బాధపడుతుంది. మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి ఆఫీస్ కి వెళ్తుంటే.. శ్రీవల్లి పిలిచి ఇంత కష్టపడి టిఫిన్ చేశాను.. తిని వెళ్ళు అనగానే.. నువ్వు తిను.. నందిని గారు ఫోన్ చేశారు వెళ్తున్నానని రామలక్ష్మి వెళ్తుంది. అదేంటి తను ఉండట్లేదు.. మనం తను పంపినట్లు విడాకుల నోటిస్ బావకి పంపిస్తున్నాం కదా.. తను లేకపోతే ఎలా అని శ్రీవల్లి అనగానే.. మరీ మంచిది ఉంటే నేను పంపలేదంటూ ఆర్గుమెంట్స్ చేస్తుందని శ్రీలత అంటుంది.

ఆ తర్వాత రామలక్ష్మి ఆఫీస్ కి వెళ్లి సీతాకాంత్ చైర్ దగ్గరికి వెళ్లి తన ప్రేమని చెప్పుకుంటూ ఉంటుంది. అప్పుడే నందిని వచ్చి.. మన కంపెనీ షేర్ వాల్యూ పడిపోతుంది. అందుకే కాల్ చేశానని నందిని అనగానే.. ఆ విషయం సీతా సర్ కి చెప్పాలి కదా అని రామలక్ష్మి అంటుంది. ఇప్పుడు నువ్వే కదా బాస్ వి అని నందిని అంటుంది. మరొకవైపు సీతాకాంత్ టిఫిన్ చేస్తుంటే.. అప్పుడే కొరియర్ వస్తుంది. అందులో రామలక్ష్మి విడాకుల నోటీసులు పంపినట్లు ఉండడంతో సీతాకాంత్ షాక్ అవుతాడు. శ్రీవల్లి వాళ్లు రామలక్ష్మి గురించి నెగెటివ్ గా చెప్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.