English | Telugu

భార్యను కాపాడుకోవడానికి భర్త... సవతి తల్లి మరో ఎత్తుగడ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -251 లొ.....సీతాకాంత్ ఆఫీస్ కి వచ్చి రామలక్ష్మిని హగ్ చేసుకొని సారీ చెప్తాడు. నిన్ను తప్పుగా అర్ధం చేసుకున్నాను.. ఇక మనల్ని ఎవరు వేరు చెయ్యలేరని సీతాకాంత్ అన్నట్లు ఉహించుకుంటాడు. రామలక్ష్మి క్యాబిన్ ముందు ఆగి నేను రామలక్ష్మికి దూరంగా ఉంటేనే తనకి సేఫ్ అందుకే దూరంగా ఉండాలని సీతాకాంత్ అనుకొని.. కొన్ని రోజులు రామలక్ష్మి ఇంటి దగ్గర ఉండాలి. ఇంటిదగ్గర అందరు తనని క్షేమంగా చూసుకుంటారని సీతాకాంత్ అనుకుంటాడు.

ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వస్తుంది.. నిన్ను కొన్ని రోజులు సస్పెండ్ చేస్తున్నానని సీతాకాంత్ అనగానే.. నేనేం తప్పు చేసానని రామలక్ష్మి అడుగుతుంది. ఇంకేం మాట్లాడకు నేను చెప్తున్నా వినాలి అంతే అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత అభి గాడు మన గురించి సీతాకి చెప్పేసి ఉంటాడని శ్రీలత, శ్రీవల్లి, సందీప్ లు టెన్షన్ పడుతుంటారు. అప్పుడే సీతాకాంత్ వచ్చి కోపంగా అమ్మ నీతో మాట్లాడాలి పైకి రా అనగానే ఇంకా టెన్షన్ పడతారు. మరొకవైపు రామలక్ష్మి దగ్గరికి సిరి వచ్చి వదిన ఈ న్యూస్ చూడమని ఇస్తుంది. అందులో అభి అనే వ్యక్తి ఆర్థిక పరిస్థితికి ఆత్మహత్య చేసుకున్నాడని ఉంటుంది. అది చూసి అభి అంత పిరికివాడు కాదని రామలక్ష్మి అంటుంది. వాడి గొడవ ఇంక లేదు మీరు హ్యాపీగా ఉండండి అని సిరి అనగానే.. మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టేది ఎవరో.. ఒక అభికి మాత్రమే తెలుసు.. చెప్పకుండానే వాడికి అయిందని రామలక్ష్మి అంటుంది.

మరొకవైపు రామలక్ష్మిని ఎవరో చంపాలని చూసున్నారని శ్రీలతతో సీతాకాంత్ చెప్తాడు. ఆ విషయం అభి చచ్చిపోతు చెప్పాడు కానీ ఎవరో చెప్పలేదు.. నేను తెలుసుకుంటాను.. నువ్వు రామలక్ష్మిని జాగ్రత్తగా చూసుకోమని శ్రీలతకి సీతాకాంత్ అంటుంది‌. హమ్మయ్య అభి గాడు నా పేరు చెప్పలేదని శ్రీలత హ్యాపీగా ఫీల్ అవుతుంది.ఆ తర్వాత శ్రీలత సందీప్, శ్రీవల్లి దగ్గరికి వచ్చి మన గురించి వాడేం చెప్పలేదు కానీ సీతాకాంత్ తెలుసుకోవాలనుకుంటున్నాడని శ్రీలత అనగానే.. సీతా అన్నయ్య అడ్డు తొలగించి ఆస్తులు సొంతం చేసుకోవాలని సందీప్ అంటాడు. మరొకవైపు సీతాకాంత్ కోసం రామలక్ష్మి వెయిట్ చేస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.