English | Telugu

సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోడు... ధన్ రాజ్ వైఫ్ శిరీష


జబర్దస్త్ తో పాటు సిల్వర్ స్క్రీన్ మీద ధన్ రాజ్ ఎంతో పాపులర్ అన్న విషయం అందరికీ తెలుసు. ధనరాజ్ ఎన్నో మూవీస్ లో నటించాడు. రీసెంట్ గా సముద్రఖనితో కలిసి "రామం రాఘవం" సినిమాలో కూడా చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఐతే ఆయన వైఫ్ శిరీష సుడిగాలి సుధీర్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది. సుధీర్ పెళ్లి చేసుకోడు అని అతనికి ఒక దగ్గర అలా స్టక్ ఐపోయి ఉండడం అంటే అస్సలు ఇష్టం లేదు అని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు ఐతే సుధీర్ ఆలోచన ఇలా ఉంది అని మరి ఫ్యూచర్ లో ఎం చేస్తాడో తెలీదు..ఆలోచన మారి పెళ్లి చేసుకోవచ్చేమో అని చెప్పుకొచ్చింది. గెటప్ శీను, చంద్ర, సుధీర్, రాంప్రసాద్ వేణు వీళ్లంతా ఎక్కుగా తమ ఇంట్లోనే ఉండేవాళ్ళు అని వీళ్లంతా ఒకే కంచంలో తిని ఒకే దగ్గర నిద్రపోయేవారని వాళ్ళ మధ్య అంత బాండింగ్ ఉందని చెప్పుకొచ్చింది. సుధీర్ ఎక్కువగా ముక్కుసూటిగా ఉంటాడు. కాబట్టి తనకు అలా ఉండేవాళ్ళంటే ఇష్టం అని చెప్పింది.

సుధీర్ సైలెంట్ గా ఉంటాడు కానీ ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసి చక్కగా సమాధానం చెప్తాడు. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా మంచిగా రెస్పాండ్ అవుతారు అని చెప్పింది. సుధీర్ బయట అందరూ అనుకునేంతగా నెగటివ్ గా ఏమీ ఉండడు.. అలాగే వేణు, చంద్ర వాళ్ళ భార్యలు పద్దు, లతా అంతా క్లోజ్ అని చెప్పుకొచ్చింది. తామంతా బాగా క్లోజ్ అని రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటాం అని చెప్పుకొచ్చింది. అలాగే తాను ఎవరి మీద డిపెండ్ కాకుండా సిరి ఈవెంట్స్ పేరుతో ఈవెంట్స్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.