English | Telugu

నేను చేద్దామనుకునేలోపే విజయ్ దేవరకొండ చేసేసాడు


గూగుల్ లో ఆటిట్యూడ్ స్టార్ ఎవరు అని టైపు చేయగానే సీనియర్ మోస్ట్ నటుడు ప్రభాకర్ సుపుత్రుడు చంద్రహాస్ పేరే కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఆటిట్యూడ్ స్టార్ట్ "రామ్ నగర్ బన్నీ" అనే మూవీలో నటించాడు. ఐతే కొడుకుని హీరోని చేయడానికి ఆస్తులు మొత్తం తాకట్టుపెట్టి మరీ సినిమాను నిర్మించాడు ప్రభాకర్. ఐతే ఈ మూవీ నిర్మిస్తున్నంత సేపు కూడా ప్రభాకర్ చాలా ప్రొఫెషనల్ గా ఉన్నాడు అని చెప్పుకొచ్చాడు చంద్రహాస్ ఒక ఇంటర్వ్యూలో. ఐతే ఈ మూవీలో నటించినందుకు మొదటి రెమ్యూనరేషన్ గా తండ్రి చేతుల మీదుగా ఒక లక్ష రూపాయలు అందుకున్నాడట.

ఐతే ఆ డబ్బును ఎం చేసావ్ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రెండు రాష్ట్రాల వరద సహాయంగా చెరో 50 వేలు ఇచ్చేశానని చెప్పాడు. ఇక నాన్న సినిమా షూటింగ్ ఎన్నాళ్ళు ఎన్నో కరెక్షన్స్ చెప్పారని చెప్పాడు. అలాగే కోపమొస్తే "నా కొడకా" అని తిట్టేవాళ్లు. నిజంగా ఆయన కొడుకునే కదా అంటూ కామెడీ చేసాడు. అలాగే "విజయ్ దేవరకొండను కలుద్దామనుకున్న ఫోన్ నంబర్ సంపాయించి మెసేజ్ చేశా. ఐతే అర్జున్ రెడ్డిలో విజయ్ స్పీచ్ విని అలా చేద్దాం ఆనుకున్న... అలాగే లాక్ డౌన్ టైములో ఆయన చాలా కార్యక్రమాలు చేశారు. అవన్నీ చూసినప్పుడు నేను చేద్దాం అనుకునేలోపే ఆయన చేసేస్తున్నారు అని అనిపించేది ..ఆయన నటనే కాదు జనాల్లోకి వెళ్లేలా ఎన్నో మంచి పనులు చేశారు అందుకే ఆయనంటే ఇష్టం" అంటూ చంద్రహాస్ ఎన్నో విషయాలు చెప్పాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.