English | Telugu

న‌న్ను హేట్ చేసేవాళ్లకు ఐ లవ్ యు చెప్తా!

జబర్దస్త్ నుంచి ఎంతో మంది స్టార్ కమెడియన్స్ గా ఎదిగారు. అలాంటి వాళ్ళల్లో చలాకి చంటి ఒకరు. చంటి ఎన్నో మూవీస్ లో నటిస్తూ జబర్దస్త్ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఐతే ఈ ఫీల్డ్ లో ఎన్నో ప్లస్ లు, మైనస్ లు ఉంటాయి. అందరికి అందరూ నచ్చరు. మరి ఇలాంటి టైంలో 'మీ హేటర్స్ కి అంటే మిమ్మల్ని ఇష్టపడని వాళ్లకు మీరేం సమాధానం చెప్తారు.. వాళ్ళ అయిష్టతను మీరెలా రిసీవ్ చేసుకుంటారు?' అనే విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో ఒక అద్భుతమైన సమాధానం ఇచ్చాడు చంటి. 'న‌న్ను ఇష్టపడని వాళ్ళకు, హేట్ చేసేవాళ్లకు ఐ లవ్ యు చెప్తా. వాళ్ళు హేట్ చేస్తేనే కదా నేను ఇంకా ముందుకు పరిగెత్తాలని తెలిసేది. ప్రేమగా ఉంటూ గోతులు తియ్యడం వేరు, ద్వేషిస్తూ మనల్ని ఇంకా పైకి వెళ్లేలా చేయడం వేరు కదా' అని చెప్పాడు చంటి.

'జబర్దస్త్ కమెడియన్స్ కి సినిమా అవకాశాలు రావు అనే టాక్ నిజమేనా?' అన్న ప్రశ్నకు 'అలాంటిది ఏమీ లేదు. కానీ ఏదైనా మూవీ ఛాన్స్ వచ్చినప్పుడు ఇటు జబర్దస్త్ కూడా అదే టైంకి చేయాల్సి వచ్చినప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేసుకునే వీలు ఉండదు.. కాబట్టి చాలామంది మూవీ ఆఫర్స్ ని వదిలేసుకుంటూ ఉంటారు' అని చెప్పుకొచ్చాడు చంటి.

'జబర్దస్త్ షో గురించి చాలా మంది వచ్చి చాలా రకాలుగా చెప్పి వెళ్లారు.. కొందరు పాజిటివ్‌గా, కొందరు నెగటివ్ గా చెప్పారు? మరి మీరేం అనుకుంటున్నారు?' అనే ప్రశ్నకు 'ఎవరి ఉద్దేశాలు వాళ్ళు చెప్పారు. చిన్నవాళ్ళనైనా, పెద్దవాళ్ళనైనా విమర్శించేంత స్థాయి, అర్హత నాకు లేదు. అంతకంటే ముందు నాకు ఎవరి గురించి చెప్పేంత టైం కూడా లేదు'అని తేల్చి చెప్పేసాడు చలాకి చంటి. 'చంటి బుర్ర బాగా వాడతారు. బిగ్ బాస్ హౌస్ లో కూడా ఇలానే బుర్ర బాగా వాడండి' అని యాంకర్ చెప్పేసరికి చంటి నవ్వేస్తాడు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.