English | Telugu
ఆలియాకి సారె పెట్టిన సుమ!
Updated : Sep 5, 2022
'బ్రహ్మాస్త్ర' టీం మూవీ ప్రమోషన్స్ ని జోరుగా చేస్తున్నారు. ఆ సినిమా సెప్టెంబర్ 9న విడుదలవుతోంది. ఇప్పుడు ఈ టీం సుమ ఆడించే క్యాష్ షోకి వచ్చేసారు. స్టేజి మీదకు ఎంట్రీ ఇస్తూనే రణబీర్ "బాగున్నారా, బాగున్నారా?" అంటూ పలకరించాడు. ఇంతలో సుమ వచ్చి "రణబీర్ కంటే ఆలియాకి తెలుగు బాగా తెలుసు" అనేసరికి "కొంచెం కొంచెం తెలుసు" అంది ఆలియా. "నీకు నా ముద్దులు, నీకు నా ముద్దులు" అంటూ ఫ్లైయింగ్ కిస్ ఒకటి ఇచ్చింది రణబీర్ కి ఆలియా.
"నువ్ మాట్లాడడానికి ఛాన్స్ రావట్లేదు అనుకుంటున్నావు కదా" అని సుమ అడిగేసరికి, "మాట్లాడకుండా ఉండడమే నాకు చాలా హ్యాపీ" అన్నాడు రణబీర్. "ఎందుకంటే నా భార్య పెద్ద చాటర్ బాక్స్ కదా, అందుకే నేను సైలెంట్ గా ఉంటాను" అన్నాడు. తర్వాత రణబీర్ కి, ఆలియాకి వాళ్ళ ఫొటోస్ చూపించి అందులో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ని మళ్ళీ రీక్రియేట్ చేయమని టాస్క్ ఇచ్చింది సుమ. ఇద్దరూ బాగా చేశారు.
తర్వాత "ఎస్ ఎస్ రాజమౌళి వెపన్ షాప్" అనే ఒకదాన్ని ఓపెన్ చేసింది సుమ.అందులో రాజమౌళి మూవీస్ లో వాడిన ఎన్నో అస్త్రాలు ఉంటాయి. అవి ఏ మూవీలో వాడారో వాటి పేర్లు చెప్తూ కాసేపు ఎంటర్టైన్ చేశారు. తర్వాత తెలుగు వారి సంప్రదాయం ప్రకారం మన ఇళ్లకు వచ్చే గర్భిణీ స్త్రీలకూ ఎలా సారె పెడతామో అలాగే ఆలియాకి బొట్టు పెట్టి చీర, గాజులు, పళ్ళు, పూలు ఇచ్చింది సుమ. ఇలా క్యాష్ లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.