English | Telugu

బిగ్‌బాస్ బ్యూటీ డైవ‌ర్స్ ఇచ్చిన‌ట్టేనా?

ఈ మ‌ధ్య ఎక్క‌డ విడాకుల ప‌ర్వం ఎక్కువైంది. ఎక్క‌డా చూసినా.. ఏ స్టార్‌ని క‌దిలించినా ఇదే న్యూస్ వినిపిస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి బిగ్ బాస్ బ్యూటీ కూడా చేరిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. కొంత మంది ఎంత తొంద‌ర‌గా ప్రేమ‌లో ప‌డుతున్నారో అంతే త్వ‌ర‌గా పెళ్లి.. ఆ త‌రువాత విడాకులు అంటూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇక ఇన్‌స్టా గ్రామ్ వేదిక‌గా ఈ బ్రేక‌ప్ వార్త‌లు మ‌రీ ఎక్కువ‌వుతున్నాయి. ఇటీవ‌ల నాగ‌చైత‌న్య - స‌మంత ఇన్‌స్టా వేదిక‌గా విడిపోతున్న‌ట్టుగా ప్ర‌క‌టించి షాకిచ్చారు.

Also Read:ఆ రూమర్స్ నమ్మకండి!

ఆ త‌రువాత కోలీవుడ్ జంట ధ‌నుష్ - ఐశ్వ‌ర్య త‌మ ద‌శాబ్దంన్న‌ర వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం ప‌లువురిని షాక్ కు గురిచేసింది. ఇక బిగ్ బాస్ జంట‌లు కూడా త‌మ ల‌వ్‌కు బ్రేక‌ప్ చెప్పేయ‌డం, ఓ జంట నెట్టింట బ్రేక‌ప్ తో వైర‌ల్ కావ‌డం తెలిసిందే. ష‌ణ్ముఖ్ - దీప్తి సున‌య‌న బ్రేక‌ప్ చెప్పుకోవ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. ఇక వీరి దారిలోనే శ్రీ‌హాన్ - సిరి కూడా త‌మ ప్రేమ‌కు బ్రేక‌ప్ చెప్పేసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రిగింది. బ‌య‌టికి చెప్ప‌క‌పోయినా వారిద్ద‌రు మాత్రం ఇప్ప‌టికీ క‌లిసి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వ‌డం లేదు.

Also Read:సమంతే విడాకులు కోరింది.. నాగార్జున సంచలన వ్యాఖ్యలు!

తాజాగా బిగ్ బాస్ ఫేమ్ హిమ‌జ కూడా చేరింద‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి. దీనికి కార‌ణం ఆమె త‌న భ‌ర్త‌ని నెట్టింట అన్‌ఫాలో చేయ‌డ‌మేన‌ని అంటున్నారు. దీంతో వీరు విడిపోతున్నార‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. హిమ‌జ‌కు పెళ్లైంద‌నే విష‌యం చాలా మందికి తెలియ‌దు. బిగ్ బాస్ షోలో కానీ, త‌న వ్య‌క్త‌గ‌త యూట్యూబ్ ఛాన‌ల్ లో కానీ హిమ‌జ త‌న‌కు పెళ్లైంద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించ‌లేదు. హిమ‌జకు 2010లో రాజేష్ ఆనంద్ అనే బిజినెస్‌మేన్‌తో పెళ్లైంద‌ని గూగుల్ సెర్చింగ్ లో క‌నిపిస్తోంది. అత‌నితో త‌ను విడిపోయిందా? లేక గూగుల్ త‌ప్పుగా చూపించిందా? అన్న‌ది తెలియాల్సి వుంది. తాజాగా హిమ‌జ‌కు చ‌ల్లా విజ‌య్ రెడ్డితో వివాహం జ‌రిగింద‌ని అయితే వీరిద్ద‌రు విడిపోతున్నార‌ని ప్ర‌స్తుతం నెట్టింట ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇది ఎంతవ‌ర‌కు నిజ‌మ‌న్న‌ది తెలియాలంటే హిమ‌జ స్పందించాల్సిందే అంటున్నారు ఆమె ఫ్యాన్స్‌.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.