English | Telugu

Brahamamudi : రేవతిని కుటుంబానికి దగ్గర చెయ్యాలనుకుంటున్న రాజ్.. రుద్రాణి కొత్త ప్లాన్! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -817 లో.....దుగ్గిరాల కుటుంబం మొత్తం వినాయకుడి పండుగ చెయ్యాలని నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడే కనకం కృష్ణమూర్తి ఎంట్రీ ఇస్తారు. ఈ పండగకి నా కూతుళ్ళని మా ఇంటికి తీసుకొని వెళ్తానని ఇందిరాదేవిని అడుగుతుంది కనకం. అవసరం లేదు నా కోడలు నా ఇంట్లోనే ఉండాలని ధాన్యలక్ష్మి అంటుంది. నీకు ప్రేమ వచ్చినా.. కోపం వచ్చిన భరించలేమని ప్రకాష్ అంటాడు.

మీ కూతుళ్ళని అక్కడికి తీసుకొని వెళ్లి పండుగ చేసుకునే బదులు.. మీరు ఇద్దరు ఇక్కడికి వస్తే అందరం కలిసి ఇక్కడే చేసుకోవచ్చు కదా అని అపర్ణ అంటుంది. ఐడియా బాగుందని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత కావ్య డల్ గా బయటకి వస్తుంది. తన వెనకాలే రాజ్ వస్తాడు. మనమందరం ఇక్కడ సంతోషంగా ఉన్నాం కానీ మీ అక్క బస్తీలో ఇబ్బంది పడుతుందని రేవతి గురించి రాజ్ కి చెప్తుంది కావ్య. మా అక్కని కలవాలని రాజ్ అంటాడు. మరొకవైపు స్వరాజ్ బట్టలు వేసుకోనని మారం చేస్తుంటాడు. అప్పుడే రాజ్, కావ్య ఇద్దరు కలిసి రేవతి ఇంటికి వస్తారు.

రాజ్ కి గతం గుర్తుకొచ్చిందని రేవతి తో కావ్య చెప్తుంది. తమ్ముడు అని రాజ్ దగ్గరికి రేవతి వచ్చి ఎమోషనల్ అవుతుంది. మీరు అందరు రేపు రండి మనం ఎప్పుడు కలిసే ఉండాలని రేవతితో రాజ్ చెప్తాడు. మరొకవైపు అప్పు కళ్యాణ్ హాస్పిటల్ కి వెళ్తారు. అప్పు రిపోర్ట్స్ చూసి అంతా ఒకే అని డాక్టర్ చెప్తుంది. కానీ మీ అక్క గర్భసంచిలో ప్రాబ్లమ్ ఉంది.. తొమ్మిది నెలలు బిడ్డని మోస్తే తన ప్రాణానికే ప్రమాదమని కావ్య గురించి అప్పుకి చెప్తుంది డాక్టర్. తరువాయి భాగంలో కావ్యని ప్రేమగా చూసుకుంటాడు రాజ్. ఆ తర్వాత ఈ ఇంటికి ఎవరు వారసులు వద్దు.. నీ కూతురే ఈ ఇంటికి వారసురాలు అవ్వాలని రాహుల్ తో రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.