English | Telugu

Brahmamudi : ఇక సెలవంటూ వెళ్ళిపోయిన బ్రహ్మముడి కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సిరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -512 లో.. రాజ్ ని రుద్రాణి రెచ్చగొడుతుంది. నీ వల్ల మా అమ్మ అలా అయింది.. తనకి ఏదైనా అయితే నిన్ను జీవితంలో క్షమించనని రాజ్ అనగానే ఏదైనా జరిగే వరకు ఈ దరిద్రాన్ని ఇంట్లో ఉండనిస్తావా.. ఇలాంటి దాన్ని ఇంట్లో ఉండనివ్వొద్దని రుద్రాణి అనగానే.. ఏం మాట్లాడుతున్నావ్ రుద్రాణి.. తప్పు జరిగిందో పొరపాటు జరిగిందో.. కావ్య సంజాయిషీ ఇస్తుంది కదా అసలు వాడు ఆవేశంలో ఉంటే ఇలాంటి సలహాలు ఇస్తావని సుభాష్ కోప్పడతాడు.

కావ్య తప్పు చేసింది కానీ రుద్రాణి మాటలు పట్టుకుని నువ్వు ఇలా ఆవేశపడడం కరెక్ట్ కాదు ఇంకా ఇలాంటివి జరగకుండా చూసుకుంటుందని ఇందిరాదేవి అంటుంది. అంత సింపుల్ గా ఎలా అంటున్నారని రాజ్ అంటాడు. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉండాలని రాజ్ అంటాడు. ఇదే మొదటి తప్పు అని కావ్యని క్షమించు.... కావ్య నీ దృష్టిలో మంచి అనుకున్నది.. వాడి దృష్టిలో చెడు అనుకుంటున్నాడు.. నువ్వు అయిన వాడిని క్షమించమని అడుగమని కావ్యతో ఇందిరాదేవి అనగానే.. నేనెందుకు అడగాలి.. అలా అడిగితే తప్పు చేసినట్టు అవుతుంది. నేను ఏ తప్పు చెయ్యలేదని కావ్య అంటుంది. ఇంతమందిలో తప్పు చేసావ్ జీవితంలో క్షమించను అంటుంటే నేను ఆత్మాభిమనం చంపుకుని క్షమించమని అడగాలా అని కావ్య అంటుంది. ఆడదానికి ఇంత అహంకారం ఎందుకని ధాన్యలక్ష్మి అంటుంది. ఈ క్షణమే దీన్ని బయటకు పంపిస్తానని రుద్రాణి అంటుంది.

ఆ తర్వాత నువ్వు ఎవరు నన్ను వెళ్లిపొమ్మనడానికి అని కావ్య రుద్రాణితో అంటుంది. నువ్వు చెప్తే నేనెందుకు వెళ్తాను. ఇప్పటికి నేను తప్పు చేసానని అయన అనుకుంటే వెళ్లిపోవడం న్యాయం, ధర్మం అనుకుంటే అప్పుడు ఆలోచిస్తాను.. వెళ్లిపొమ్మంటారా అని కావ్య అడుగుతుంది. అసలు బ్రతిమిలాడడం లేదంటు రాజ్ ని రుద్రాణి రెచ్చగొడుతుంది. ఇప్పుడు చెప్తున్నాను.. నువ్వు నా భార్యగా ఉండడానికి పనికి రావు.. ఈ ఇంటి కోడలిగా ఉండే అర్హత లేదు.. ఇంట్లోవాళ్ళ కోసం నిన్ను ఇన్ని రోజులు భరించానంతే తప్ప ప్రేమతో కాదని రాజ్ అనగానే కావ్య మనసు ముక్కలవుతుంది. ఇక మీ ప్రేమ కావాలి అని అడుక్కునే అవసరం నాకు లేదని కావ్య అంటుంది. తరువాయి భాగంలో ఈ ఇంట్లో నా పాత్ర ముగిసింది.. ఇక సెలవంటూ కావ్య ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.