English | Telugu

Brahmamudi : కొత్తజంటకి అల్లరి మామ సపోర్ట్.. కావ్యకి దగ్గరవుతున్న రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -498 లో.. అప్పుని తీసుకొని కళ్యాణ్ తన ఇంటికి వరలక్ష్మి వ్రతానికి వస్తాడు. అప్పు ఈ ఇంటికి సరైన కోడలు కాదని నిరూపించే ప్రయత్నం చేస్తుంది ధాన్యలక్ష్మి. వరలక్ష్మి వ్రతం పూర్తి అవ్వగానే.. ముగ్గురు అక్కచెల్లెళ్ళు తమ భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత వచ్చిన వాళ్లకి భోజనం వడ్డీస్తుంది అప్పు. దాంతో నువ్వు వచ్చిన వాళ్ళని అవమానించడం కోసమే పిలిచావా.. ఫస్ట్ ఎవరైనా అన్నం పెడుతారా అని ధాన్యలక్ష్మి అంటుంది.

మా చెల్లికి ఇలాంటివి తెలియదు అని కావ్య వడ్డీస్తుంది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి వాయినం ఇస్తారు. వచ్చిన వాళ్లు వెళ్లేముందు ఈ అప్పు మాత్రం ఈ దుగ్గిరాల ఇంటికి కోడలు గా తగదని చెప్పి వెళ్తారు. ఆ తర్వాత అప్పు, కళ్యాణ్ లు బయలుదేర్తామని రాజ్ కి చెప్తారు. ఏంటి రా మీరు ఇక్కడే ఉండండి అని రాజ్ అంటాడు. ఈ అద్దాల మేడలో ఎవరు రాయి విసిరిన పగిలేలా ఉంది.. అయినా మేమ్ వచ్చింది ఉండిపోవడానికి కాదు తాతయ్య, నానమ్మల మాట కాదనలేక వచ్చమని కళ్యాణ్ అంటాడు. ఈ ఒక్క రోజు వస్తే చూసారు కదా పరిస్థితి ఎలా ఉందో అన్నట్లుగా కళ్యాణ్ అంటాడు. వచ్చినందుకు నీకేం తక్కువ చేసానని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ మాట నువు అంటున్నావా.. వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ని అవమానించావని ధాన్యలక్ష్మితో ఇందిరాదేవి అంటుంది. అయిన వచ్చిన వాళ్ళు అన్నారు కదా.. ఆ అమ్మాయి ఈ ఇంటికి కరెక్ట్ కాదని అని ధాన్యలక్ష్మి అంటుంది. అసలు వాళ్ళని మీరు పిలిచారా అని స్వప్న, అపర్ణలని ఇందిరాదేవి అడుగుతుంది. లేదని అపర్ణ అనగానే అయితే మా చెల్లిని అవమానించిడానికి మీరే పిలిచారని ధాన్యలక్ష్మితో స్వప్న అంటుంది. ఆ విషయం నాకు ఎప్పుడో అర్థం అయిందని కళ్యాణ్ అంటాడు.

ఆ తర్వాత కళ్యాణ్ వాళ్లని ఇందిరాదేవి ఉండమని అంటుంటే.. ఎందుకు అమ్మ రోజు ఇలాగే నా కోడలు అవమానపడాలి అనుకుంటాన్నావా.. వద్దు వాళ్ళకి ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది.. ప్రేమ ఉంది.. వాళ్ళు ఎక్కడైనా హ్యాపీగా ఉంటారని ప్రకాష్ అంటాడు. వెళ్ళు మీరిద్దరు మళ్ళీ ఈ ఇంటికి తలెత్తుకొని వచ్చే రోజు వస్తుంది. అప్పుడు నిన్ను అనేవాళ్ళు తలదించుకుంటారని అప్పుతో కావ్య చెప్తుంది. ఆ తర్వాత అప్పుని తీసుకొని కళ్యాణ్ వెళ్ళిపోతాడు. తరువాయి భాగంలో కావ్యని రాజ్ ప్రేమగా దగ్గరకి తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.