English | Telugu
Brahmamudi: ఫోన్ లోనే భార్యతో రొమాన్స్ కురిపిస్తున్న భర్త.. షాక్ లో రుద్రాణి!
Updated : Apr 26, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి (Brahmamudi)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-705లో.. రాజ్ సంతకాన్ని కావ్య ఫోర్జరీ చేసిందని దుగ్గిరాల కుటుంబంలోని అందరికి రుద్రాణి డాక్యుమెంట్ పేపర్స్ చూపిస్తుంది. ఆ మాటలకు స్పందించిన కావ్య.. గతంలో రాజ్ ఏదైనా అత్యవసర పరిస్థితిల్లో తను లేకపోతే పవర్ అఫ్ పటార్నీ కావ్యకు ఉండాలని డాక్యుమెంట్లు రెడీ చేసినట్టు.. అవే ఇప్పుడు సమయానికి ఉపయోగపడ్డాయని కావ్య ఇంట్లో వాళ్ళందరికి చెప్తుంది. కానీ ఆ మాటలు రుద్రాణి నమ్మదు.. నువ్వు చెప్పింది నిజం కాదు కావ్య.. నువ్వే ఆ పేపర్లపై సంతకాలు చేసి ఇప్పుడు ఇలా కవర్ చేస్తున్నావని అంటుంది. మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు రుద్రాణి గారు అని కావ్య అనగానే కానీ నాకు ఉంది.. నువ్వు చేసిన పని బయట పెడతాను అగు అని చెప్పి ఒక ఫోన్ చేస్తుంది రుద్రాణి.
అలా ఫోన్ చెయ్యగానే.. సంతకాలు ఫోర్జరీనా.. లేక రాజ్ పెట్టిన సంతకమా అని చెక్ చేయించడానికి స్పెషలిస్ట్ ను పిలిపిస్తుంది. అతను ఇంట్లోకి వచ్చి డాక్యుమెంట్లు చెక్ చేస్తాడు. అవి చూసిన అతను ఆ సంతకాలు నిజమని చెప్పగానే రుద్రాణి షాక్ అవుతుంది. అప్పుడే కావ్య కోసం రాజ్ కాఫీ షాప్ కు తిరిగి వచ్చి ఆ సంతకం చేసినట్టు, అయినవాళ్ల కోసం ఏమైనా చేస్తానని కావ్యకు ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చినట్టు రాజ్ చెప్తాడు. అదంతా కావ్య ఊహించుకొని సంతోషపడతుంది. మరోవైపు ఆ సంతకం పెట్టింది రాజేనని తెలుసుకున్న దుగ్గిరాల కుటుంబం.. రుద్రాణికి చుక్కలు చూపిస్తారు.. అసలు నీకు సిగ్గు అనేది లేదా.. ప్రతిసారి కావ్యపై ఇలా పడతావ్ ఏంటని ఆమెను అందరు తిడుతారు.. అయిన సరే రుద్రాణి అవేం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది.
మరోవైపు వజ్రాలకొండ అంటే ఏంటి అసలు.. అది ఎక్కడుందని రాజ్ తనలో తనే ప్రశ్నలు వేసుకుంటుంటాడు.. నెట్ లో కూడా సెర్చ్ చేస్తాడు.. అయిన సరే అతనికి అర్థం అవ్వక కావ్యకు ఫోన్ చేస్తాడు. ఇక అలా ఉదయం కాఫీ షాప్ లు, రాత్రి ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ కావ్య, రాజ్ లు మళ్లీ తమ ప్రేమ జీవితాన్ని కొత్తగా మొదలెడతారు. మరి రాజ్ కి గతం గుర్తుస్తొందా.. యామిని ఏం చేయనుంది? ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.