English | Telugu
Karthika Deepam2: జైల్లో దీప.. కార్తీక్ కి రెండో పెళ్ళి చేయాలన్న తండ్రి!
Updated : Apr 26, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-341లో.. వాదోపవాదాలు విన్న జడ్జ్ దీపకి బెయిల్ కూడా ఇవ్వకుండా జైలుకి పంపిస్తాడు. ఇక కార్తీక్ వాళ్ళు ఇంటికి వెళ్లి బాధపడతారు. జైల్లో ఉన్న దీప.. తన పరిస్థితేంటని బాధపడుతుంది. మరోవైపు హాస్పిటల్ నుంచి ధశరథ్ ఇంటికి వస్తాడు. వచ్చి రాగానే చెల్లి గురించి అడిగితే శివన్నారాయణ తన మీద అరుస్తాడు. నీకు చెల్లిపై ప్రేమ ఉన్నట్టు ఆమెకు నీపై లేదని అంటే దశరథ్ సైలెంట్ గా ఉంటాడు. జ్యోత్స్న మాత్రం దీపకు శిక్ష పడేలా చెయ్యాలని అందరిని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.
మరోవైపు లాయర్ తో కార్తీక్ మాట్లాడతాడు. అసలు దీప తుపాకీ పేల్చకపోతే బుల్లెట్ ఎలా తగిలింది.. అది మనం కనుక్కోవాలి.. దీపకు ఇంట్లో వాళ్ళు కాకుండా ఎవరైనా శత్రువులు ఉన్నారా.. మరీ ఇంట్లో వాళ్లే చేసి ఉండాలి.. జ్యోత్స్న చేసే అవకాశం ఉందా అని మరో ప్రశ్న వేస్తే కార్తీక్ ఆలోచిస్తాడు.. ఫస్ట్ మనం ప్రూవ్ లు సంపాదించాలి.. లేదంటే వాళ్ళ లాయర్ చాలా డేంజర్.. బయటపడటం కూడా కష్టమని దీప లాయర్ చెప్తాడు. మరోవైపు దీపను అరెస్ట్ చేసిన పోలీసును జ్యోత్స్న డబ్బుతో కోనేస్తుంది. ఫస్ట్ అతను చెయ్యనని చెప్పినా కావాల్సినంత డబ్బు, కూతురుకు స్కూల్ లో సీటు అన్ని ఇప్పిస్తానని జ్యోత్స్న ఆశ చూపించి సాక్ష్యాలను మార్చమని పోలీసుకు చెప్తుంది.
మరోవైపు దీపను కలవడానికి వచ్చిన కావేరి ఆమెకు దైర్యం చెప్తుంది కానీ శ్రీధర్ వచ్చి దీప బాధపడేలా మాట్లాడుతాడు. నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావ్ దీప.. నా కొడుకు నీవల్ల కోర్టులు కేసులు అంటూ తిరుగుతున్నాడు.. నిన్ను ఎలాగో ఆ కుటుంబం వదలదు.. నువ్వు జైల్లో బానే ఉంటావ్ కానీ బయట నా కొడుకు పరిస్థితేంటి.. నీ కూతురు పరిస్థితేంటి.. ఆలోచించు.. కార్తీక్ ను రెండో పెళ్లి చేసుకోమని చెప్పు.. నువ్వు చెప్తేనే ఒప్పుకుంటాడని దీపతో శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.