English | Telugu

Brahmamudi :  పోలీస్ గా అప్పు.. పాపతో దుగ్గిరాల ఇంట హ్యాపీ మూమెంట్స్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -638 లో..... రాజ్, కావ్య ఆఫీస్ లో ఉండగా అప్పుడే అపర్ణ ఫోన్ చేసి.. మీ అక్కకి పాప పుట్టిందని చెప్తుంది. దాంతో రాజ్, కావ్య ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. స్వప్న తన బిడ్డతో హాస్పటల్ నుండి ఇంటికి వస్తుంది. కావ్య హారతి ఇచ్చి మరి ఆహ్వానిస్తుంది. అందరు పాపని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటే రాహుల్, రుద్రాణి మాత్రం ఏం పట్టనట్టు ఉంటారు.

ఇందిరాదేవి స్వప్న కూతురుతో ముద్దాడుతూ ఉంటుంది. ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని మురిసిపోతంటే.. ఇప్పటికైనా ఎవరి ఆస్తులు వాళ్లకు వస్తే అందరు హ్యాపీ అని ధాన్యలక్ష్మి అంటుంది. వారసుడు వస్తాడనుకుంటే పాపని తెచ్చిందంటూ రుద్రాణి నిరాశగా మాట్లాడుతుంటే.. నువ్వు ఆడదానివే కదా అంటూ ఇందిరాదేవి రుద్రాణిని కోప్పడుతుంది. అప్పుడే రాజ్ కి డాక్టర్ ఫోన్ చేసి.. మీ తాతయ్య కోమాలో నుండి బయటకు వచ్చాడని చెప్పగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మహాలక్ష్మి అడుగుపెట్టింది ఇలా జరిగిందని కావ్య అంటుంది. రాజ్, కావ్య, ఇందిరాదేవిలు సీతారామయ్య దగ్గరికి వెళ్లి మాట్లాడతారు.

మరొకవైపు అప్పు పోలీస్ అయి కనకం దగ్గరికి వస్తుంది. ముందు తనని ఫ్రాంక్ చేస్తుందని అనుకుంటుంది కానీ అప్పు నిజం గానే పోలీస్ అయిందన్న విషయం కళ్యాణ్ చెప్తాడు. దాంతో కృష్ణమూర్తి, కనకంలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెళ్లి మీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండని అప్పు, కళ్యాణ్ లకి కనకం చెప్తుంది. మరొకవైపు స్వప్న పాపకి బారసాల చెయ్యాలని ఇందిరాదేవి అంటుంది. ఆ బాధ్యత రాజ్, కావ్య చూసుకుంటారని సుభాష్ అంటాడు. తరువాయి భాగంలో స్వప్న పాప ఏడుస్తుంటే.. కావ్య ఎత్తుకొని పాట పాడుతూ పాప బజ్జోపెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిదో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.