English | Telugu

Brahmamudi : భార్యతో ఉన్నట్టుగా పట్టపగలే ఊహల్లో భర్త! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -560 లో.. ధాన్యలక్ష్మి ప్రకాష్ ఇద్దరు కలిసి అప్పు, కళ్యాణ్ లని దీపావళికి ఇంటికి పిలవడానికి వస్తారు. కళ్యాణ్ ని రమ్మని ధాన్యలక్ష్మి అనగానే.. ఆలోచిస్తా అని కళ్యాణ్ అంటాడు. ఇక్కడికి వరకు వచ్చి పిలిస్తే అలా అంటావని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పు నా భార్య.. తనని పిలవకుండా నన్ను పిలిస్తే ఎలా వస్తానని కళ్యాణ్ అనగానే.. నాకు తెలుసు అందుకే కదా పిలవడానికి వచ్చానని ధాన్యలక్ష్మి అంటుంది. అవునురా ఇద్దరిని పిలుస్తుందని ప్రకాష్ అనగానే.. వస్తాం మావయ్య అని అప్పు చెప్తుంది.

ఆ తర్వాత రాజ్ దగ్గరికి ఇందిరాదేవి వస్తుంది. ఇంకా నిద్ర లేవలేదా.. ఈ రోజు దీపావళి అంటూ రాజ్ ని నిద్ర లేపుతుంది. లేచి గుమ్మానికి పువ్వులు కట్టు అంటూ పువ్వుల దండలు ఇచ్చి వెళ్తుంది. ఇక రాజ్ ఏం పని చేసినా కావ్యని ఉహించుకుంటాడు. తనతో మాట్లాడినట్లు అనుకుంటాడు. ఆ తర్వాత కావ్య నిజంగానే వస్తుంటుంది. తనని చూసి మళ్ళీ ఉహ అనుకొని తన చుట్టూ తిరుగుతు ఉంటాడు. అది చూసి అపర్ణ, ఇందిరాదేవీలు ఎందుకు ఇలా చేస్తున్నావంటూ అడుగుతారు. అప్పుడు రాజ్ ని గిల్లుతుంది కావ్య. దాంతో రాజ్ ఉహలోనించి బయటకు వచ్చి ఎందుకు వచ్చవంటూ అడుగుతాడు. తను సీఈఓ తన చేతుల మీదుగా బోనస్ ఇవ్వాలని మీ తాతయ్య పిలిచాడనగానే రాజ్ కుళ్ళుకుంటాడు.

ఆ తర్వాత అనామికకి రుద్రాణి ఫోన్ చేసి.. ఏదో ప్లాన్ అన్నావ్ ఏంటని అడుగుతుంది. దాంతో అనామిక, కళ్యాణ్ ల డాక్యుమెంటరీ గురించి చెప్తుంది. టెలికాస్ట్ అయ్యే టైమ్ కి వాళ్ళని టీవీ చూసేలా చేయమని అనామిక అనగానే.. రుద్రాణి ఓకే అంటుంది.ఆ తర్వాత అపర్ణ సుభాష్ కి పాయసం చేసి తీసుకొని వస్తుంది. నువ్వే తినిపించు అనగానే అపర్ణ తినిపిస్తుంది. అప్పుడే కావ్య వచ్చి ఆటపట్టిస్తుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి ఇందిరాదేవి వచ్చి బోనస్ ఇచ్చే చెక్కు లు చెక్ చేయమంటుంది. తరువాయి భాగంలో రాజ్ దగ్గరికి కావ్య వెళ్లి.. బోనస్ నా చేతుల మీద కంటే మీరు ఇస్తేనే బాగుటుందని కావ్య అనగానే.. నీ దయ నాకు అవసరం లేదని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.