English | Telugu

Tanuja : దత్తపుత్రిక తనూజ ఖాతాలో దివ్య బలి.. బిగ్ బాస్ సపోర్ట్ ఆమెకేనా!

తనూజ కన్నింగ్ బయటపడింది.. రీతూతో కలిసి గేమ్ ప్లే చేస్తున్న తనూజని అందరి ముందు ఫెయిర్ గా చూపించడానికి బిగ్ బాస్ చాలా కష్టపడుతున్నాడు. ఆమెతో గొడవపెట్టుకుంటే ఎవరైనా ఎలిమినేట్ అవ్వాల్సిందేనని మరో ఎలిమినేషన్ ద్వారా తెలిసింది.

ఇంటికొచ్చిన అతిథులకి భోజనం ఒకేలా వడ్డించాలి కానీ కొందరికి వెండి ప్లేట్ లో భోజనం పెట్టి, మరికొందరికి బంగారు ప్లేట్ లో పెడితే ఇలాగే ట్రోల్స్ చేస్తారు. దివ్య ఎలిమినేషన్ కి కారణం బిగ్ బాస్ మామ చేసిన జిమ్మిక్కు అంటు నెటిజన్లు మండిపడుతున్నారు. అందులో ఓటింగ్ రిజల్ట్స్ లో తనూజకి ముప్పై శాతం ఓటింగ్ పడటం చూసి అది అంత కన్విన్సింగ్ గా అనిపించడం లేదే అని భావిస్తున్నారు. తనూజ కన్నింగ్ ని బయటకి రానివ్వకుండా ఉండటానికి లాస్ట్ వీక్ కెప్టెన్సీ వీక్ లో దివ్యకి వెన్నిపోటు పొడిచిన వీడియోని బయటకు రానీయకుండా సంజన, రీతూల మధ్య జరిగిన ఇష్యూతో ఎపిసోడ్ కొనసాగించాడు. దాని తర్వాత కళ్యాణ్, డీమాన్ పవన్ ల ఇష్యూతో సగం ఎపిసోడ్ ని ముగించాడు బిగ్ బాస్ మామ. తనూజ పొగరుగా మాట్లాడింది.. అటిట్యూడ్ తో ఉన్నది.. కనపడకుండా చేసి.. దివ్య ఏం మాట్లాడినా దానిని నెగెటివ్ చేస్తూ చూపించాడు బిగ్ బాస్.

తనూజని ఎంత పాజిటివ్ గా చూపిస్తున్నారంటే.. చివరికి షోకి వచ్చిన ఆడియన్స్ తో కూడా తనూజ ఫ్యాన్స్ అని చెప్పించాడు. రీతూతో దివ్యని కెప్టెన్సీ రేస్ నుండి తీసేసిన తనూజ గేమ్ స్ట్రాటజీని ఎక్కడ నెగెటివ్ గా పోట్రే చేయలేదు.. అదే అంతకుముందు వారం తనూజని గేమ్ నుండి తీసెయ్యాలని దివ్య చెప్పింది మాత్రం చూపించాడు బిగ్ బాస్. ఇదొక్కటి చాలు దివ్యని ఎంత నెగెటివ్ చేయాలో అంతా చేశారు.. తనూజని ఎంత పాజిటివ్ చేయాలో అంత పాజిటివ్ గా చూపించాడు. ‌అందుకే రివ్యూలు, ట్రోలర్స్ కూడా తనూజని దత్తపుత్రిక అని అంటారు. మొత్తానికి తనూజ ఖాతాలో దివ్య బలి అయింది. ఈ వారం కూడా తనూజకి ఎవరైతే నెగెటివ్ అవుతారో వాళ్ళే ఎలిమినేట్ అవుతారని ఆడియన్స్ ఫిక్స్ అవుతున్నారు.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.