English | Telugu

బిగ్ బాస్ -7  గ్రాంఢ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. అయితే ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని ఏడవ సీజన్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా ఈ షో ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో అందరికి తెలుసు. అత్యధిక టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న బిగ్ బాస్.. గత సీజన్ లో పాపులారిటి లేని కంటెస్టెంట్ ని తీసుకొని విమర్శలు పొందింది. అయితే ఇప్పుడు కంటెస్టెంట్స్ ఎంపికపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు తెలుస్తుంది.

బిగ్ బాస్ మొదట సీజన్ కి హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్, రెండవ సీజన్ కి నాచురల్ స్టార్ నాని చెయ్యగా.. గత నాలుగు సీజన్ల నుండి నాగార్జున హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే.. కాగా ఈ సీజన్ కి వేరే స్టార్ హీరో హోస్ట్ గా చేస్తున్నట్టు వార్తలు వినిపించినా.. చివరికి ఈ సీజన్ కి కూడా నాగార్జుననే హోస్ట్ గా చేస్తునట్లు.. దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కంటెస్టెంట్స్ కూడా చాలా వరకు కన్ఫమ్ అయినట్లు తెలుస్తుంది.. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ సెట్ ని ఎప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో అన్ని హంగులతో తీర్చిదిద్దారు. అయితే అన్నపూర్ణ స్టూడియో సిటీ మధ్యలో ఉన్నందున బయటవారికి బిగ్ బాస్ హౌస్ లో వేకప్ సాంగ్ వినిపించడం.. అలాగే వాళ్ళు పెద్ద పెద్దగా గొడవపడుతు అరుచుకునేవన్ని వినిపిస్తు ఉండడం వల్ల టీవిలో టెలికాస్ట్ కి ముందే.. కొన్ని కొన్ని లీక్ అవుతున్నాయి. దీంతో ఈ సారి బిగ్ బాస్ సెట్ వేరే దగ్గర ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లీక్ అయిన సమాచారం ముందుగానే ప్రేక్షకులకు తెలుస్తుండడం వళ్ళ బిగ్ బాస్ ప్రేక్షకులకు అంత ఆసక్తికరంగా ఉండట్లేదని యాజమాన్యం ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది.

బిగ్ బాస్ ఇప్పటికే పాపులర్ ఛానల్ అయినా స్టార్ మా టీవీలో గత ఆరు సీజన్ల నుండి ప్రసారం అవుతుంది‌. కానీ ఈ సీజన్ స్టార్ మా టీవీ కాకుండా జెమిని టీవీలో ప్రసారం చేస్తున్నారని సమాచారం. ఓటిటి మొదటి సీజన్ ఆశించినంతగా ఎంటర్టైన్మెంట్ చెయ్యలేదు.. కాగా రెండవ సీజన్ కి ఛాన్స్ ఇవ్వలేదు. ఆ తర్వాత వరుసగా బిగ్ బాస్ సీజన్-6. వరకు స్టార్ మా టీవీలో ప్రసారమయైన ఈ షో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించిందనడంలో అతిశయోక్తి లేదు. అయితే సీజన్-7 తో సెప్టెంబర్ 2 ఆదివారం గ్రాంఢ్ గా లాంచ్ అవుతున్నట్లు ఒక న్యూస్ అయితే బయట చక్కర్లు కొడుతుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.