English | Telugu

Bigg boss 9 Telugu : దివ్య బట్టలు దొంగతనం చేసిన సంజన.‌. మాటిచ్చిన ఇమ్మాన్యుయేల్!

బిగ్ బాస్ సీజన్-9 లోకి దివ్యని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి తీసుకొచ్చారు. ఇక తను వచ్చీరాగానే సంబంధించిన బట్టలన్నీ సంజన, శ్రీజ దాచేస్తారు వాటిని బీన్ బ్యాగ్ లో పెడుతుంటే ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్ వస్తాడు. ఇద్దరు సైలెంట్ గా వెళ్ళిపోతారు. కాసేపటికి దివ్య వచ్చి చూసేసరికి తన బట్టలు లేవు.. దాంతో తను ముందు సంజనని అడుగుతుంది. నాకు తెలియదని సంజన అంటుంది. ఇవ్వకండి ఇలాగే వారం రోజులు ఉంటానని దివ్య అంటుంది.

అప్పుడే పవన్ కళ్యాణ్ వచ్చి బీన్ బ్యాగ్ లో ఉన్నట్లు క్లూ ఇస్తాడు. తను వెళ్లి చూసేసరికి బట్టలు ఉంటాయి. సంజననే బట్టలు తీసిందని శ్రీజ చెప్తుంది.ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్ కూడా ఉన్నారని దివ్యతో ప్రియ చెప్తుంది. ఇమ్మాన్యుయల్ ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తాడు అనుకోలేదని భరణి అంటాడు. ఆ తర్వాత దివ్యతో ఇమ్మాన్యుయల్ మాట్లాడతాడు. అందులో పెట్టడం చూసాను కానీ ఏంటని చూడలేదు రాము వస్తుంటే కూడా మనకి ఎందుకులే అని తీసుకొని వచ్చానని ఇమ్మాన్యుయల్ చెప్తాడు. శ్రీజ కూడా దివ్యకి సారీ చెప్తుంది. దివ్య వచ్చింది ఫస్ట్ డేనే కదా నీకు జోక్ అయి ఉండొచ్చు.. కానీ అందరికి కాదని, మీతో ఉంటే మీరు సేఫ్ మీతో ఉన్నవాళ్ళు బలి అవుతారు అందుకే నేను రాలేదని సంజనతో రీతు అంటుంది.

ఆ తర్వాత సంజన, దివ్య మాట్లాడుకుంటారు. నేను తీసాను కానీ నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని చేశాను.. మా గురించి నీకు తెలుసు నీ గురించి మాకు తెలియదు కదా.. నీకు సంబంధించినవి దొంగతనం చేస్తే అలుగుతావో‌.. కోప్పడుతావో ఎలా రియాక్ట్ అవుతావో చూద్దామనుకున్నానని సంజన అంటుంది. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అవుతాడు. నా బట్టలు దొంగతనం చేసిన వాళ్ళకి కచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలని ఇమ్మాన్యుయల్ తో దివ్య అంటుంది. తప్పకుండా నువ్వు సాటిస్ఫాక్షన్ అయ్యేలా పనిష్మెంట్ ఉంటుందని దివ్యకి ఇమ్మాన్యుయల్ మాటిస్తాడు. దివ్యకి మాటిచ్చిన్నట్టుగా సంజనకి ఇమ్మాన్యుయల్ పనిష్మెంట్ ఇస్తాడా లేక అమ్మ అని వదిలేసి సెంటిమెంట్ చూపిస్తాడా చూడాలి మరి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.