English | Telugu

పెళ్లి కాకుండానే విడాకులా?.. బిగ్ బాస్ హిమజ ఫైర్!

ఇటీవల సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఫేమ్ హిమ‌జ కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకోడానికి సిద్ధమైందని న్యూస్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలను హిమ‌జ ఖండించింది. అసలు పెళ్లే కాకుండా విడాకులు ఎవరికి ఇస్తానంటూ హిమజ సంచలన వ్యాఖ్యలు చేసింది.

విడాకుల వార్తలను ఖండిస్తూ హిమ‌జ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని విడుదల చేసింది. తన పెళ్లి, విడాకుల గురించి ఫేక్ న్యూస్ వస్తున్నాయని, నార్మల్ గా అయితే వీటిని పట్టించుకునే దానిని కాదని, కానీ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి స్పందించాల్సి వస్తుందని చెప్పింది.

తనకి తెలియకుండానే తన పెళ్లి చేసేస్తున్నారు, విడాకులు ఇచ్చేస్తున్నారని హిమజ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తాను సింగల్ గా హ్యాపీగా ఉన్నానని, ఒకవేళ పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పి ఘనంగా చేసుకుంటానని తెలిపింది. బుద్ధిలేనోడు ఎవడో డబ్బులిచ్చి ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాడని, ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేసేముందు మీడియా వాళ్ళు కొంచెం ఆలోచించాలని హిమజ కోరింది. ఈ ఫేక్ న్యూస్ పై తాను సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు కూడా చేశానని హిమజ తెలిపింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.