English | Telugu

Bigg Boss 9 Telugu Buzz :  బజ్ ఇంటర్వ్యూలో కూడా మాస్క్ మ్యాన్ అరాచకం.. శివన్నకి మైండ్ బ్లాక్!

బిగ్ బాస్ సీజన్-9 లో నాలుగో వారం పూర్తయింది. కామన్ మ్యాన్ కేటగిరీలో అడుగుపెట్టిన మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ లో అడుగుపెట్టిన నుండి ఎవరితో సరిగ్గా మాట్లాడకపోవడం, ఒంటరిగా ఉండటం, నామినేషన్లో అందరిపైకి విరుచుకుపడటం.. అలాగే గేమ్స్ లో యాక్టివ్ పార్టిసిపిషేన్ లేకపోవడంతో తనంటే జనాలకి నెగెటివ్ అయ్యాడు.

ఇక ఎలిమినేషన్ అయి బయటకొచ్చేసిన మాస్క్ మ్యాన్ హరీష్ బజ్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలని షేర్ చేసుకున్నాడు. శివాజీ హౌస్ లో ఎంతమంది ఉన్నారో అంతంది ఫోటోలని చింపేశాడు. ఒక ముగ్గురి ఫోటోలని మాత్రం చింపలేదు. తనూజ, పవన్ కళ్యాణ్, సుమన్ శెట్టి ఫోటోలని చించలేదు. అసలు ఇక్కడేం మేటర్ లేదు ఇదంతా డొల్లే అంటున్నారు ఆడియన్స్.. అంటూ హరీష్ ముఖం మీదే అడిగాడు శివాజీ. నిజాయతీ మనిషి ఫేక్‌గా కాదు ఫెయిర్‌గా ఉండే మనిషి రావాలని కోరుకున్నప్పుడు నేను నిజాయతీగా ఉండాలి కదా అక్కడ అంటూ హరీష్ బదులిచ్చాడు. ఎంతసేపు మీరు.. నేను, నేను.. మీరు అన్నారు.. ఏంటి సర్ ఈ డబ్బా అని బయట దొబ్బుతున్నారు బయట అంటూ శివాజీ ఫైర్ అయ్యాడు. భారతదేశంలో మావా ఇవాళ మన డబ్బా మనమే కొట్టుకోవాలని హరీష్ చెప్పగానే సినిమా డైలాగ్ ఇది అంటూ పంచ్ వేశాడు.

నేను అరచేతిలో ఆరు(6) అని రాస్తే జనాలకి చూపించేటప్పుడు అది తొమ్మిది(9) లానే కనిపిస్తుంది.. ఇది 6 అని అర్థమయ్యేది నాకు ఒక్కడికే కదా.. అని హరీష్ అన్నాడు. దీనికి ఇది రియలైజేషన్.. తెలుగు యువత మీకు కొన్ని బిరుదులు ఇచ్చారు సర్ అంటూ శివాజీ అన్నాడు. ఇంతలో భగత్ సింగ్ ఒక్కడే.. సుభాష్ చంద్రబోస్ ఒక్కడే నేనూ ఒక్కడినే.. అంటూ హరీష్ మళ్లీ తన డబ్బా మొదలుపెట్టాడు. ఇది చూసి మీ కంపారిజన్ మాత్రం తగ్గట్లేదే ఎక్కడా.. బిగ్‌బాస్ హౌస్‌కి వచ్చిన తర్వాత ఇతను చాలా మంచి మనిషిని చెట్టు అవ్వాలి.. పీకిపడేశారంతే అంటూ హరీష్‌పై రెచ్చిపోయాడు శివాజీ. ఈ మాటలకి మీరు నన్ను మాట్లాడనివ్వట్లేదంటూ హరీష్ ఆగిపోయాడు.

తప్పుడు మనిషంటే ఎన్ని అర్థాలు తీసుకుంటారని హరీష్‌ని అడిగాడు శివాజీ. తప్పు చేసేవాళ్లని తప్పుడు మనిషే అంటారు కద సర్ అని హరీష్ అడిగాడు. అతను అంటే తప్పేముందండి అని శివాజీ మళ్లీ ప్రశ్నించాడు. నేను ఆన్ ఫేస్ మాట్లాడతా.. రైటా రాంగా అనేది నేను తెలుసుంటా.. రాంగ్ అయితే రియలైజ్ అవుతా.. అంటూ హరీష్ క్లాస్ పీకాడు. ఇప్పుడు అర్థమైందా మీకు బిగ్‌బాస్ ఎంత తోపునైనా వొంగోబెట్టి పుంగి బజాయిస్తుందండంటూ శివాజీ చెప్పాడు. మీ భార్య చాలా సింపుల్ గా ట్రెడిషనల్ ఉంది. మీ గురించి చాలా గొప్పగా చెప్పింది. కానీ మీరు ఎవరితో మాట్లాడకుండా మీలో మీరే మాట్లాడుకోవడం అనేది జనాలకి, నాగార్జునికి, బిగ్ బాస్ కి నచ్చలేదని శివాజీ అన్నాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.