English | Telugu

ఆదిత్యకి  రెమ్యూనరేషన్ ఎక్కువేనట.!

బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు ఆదిత్య సుపరిచితమే. కాని ఆదిత్య బిగ్ బాస్ లోకి రాకముందే చాలా మందికి తెలుసు. ఇతను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జన్మించాడు. తండ్రి శంకర్, తల్లి కళ్యాణి. ఒకప్పుడు తండ్రి కూడా నటుడే. తన సోదరుడు కౌశిక్. అందరికి తెలిసిన బుల్లి తెర నటుడే. అయితే తన చిన్నప్పటి నుండి బాలనటుడిగా అగ్ర హీరోలతో నటించాడు. 2003 లో వచ్చిన 'చంటిగాడు' మూవీలో హీరో గా నటించాడు. ఆ తర్వాత 'సుందరానికి తొందరెక్కువ', '1940 లో ఒక గ్రామం', 'మా ఉరి పొలిమేర', 'అన్నపూర్ణమ్మ గారి మనవడు' ఇలా పదికి పైగా సినిమాల్లో నటించగా, అరవైకి పైగా సినిమాల్లో బాలనటుడిగా నటించాడు. తన‌ నటనకు గాను, చిన్నప్పటి నుండి ఎన్నో అవార్డులను సంపాదించుకున్నాడు. తన భార్య పేరు మానస. కాగా తనకి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆదిత్య వెండి తెరపై కాకుండా బుల్లితెర సీరియల్స్ లోను నటిస్తూ రాణిస్తోన్నాడు. కాగా రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో అవకాశం దక్కించుకున్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో పదకొండవ వ కంటెస్టెంట్ గా ఆదిత్య అడుగుపెట్టాడు. మొదటి రోజు నుండి అందరితో సన్నిహితింగా ఉంటు, అందరిని ఆకట్టుకుంటున్నాడు. అయితే తను మృదుస్వభావి. ఎవరి మనసు నొప్పించకుండా ప్రవర్తిస్తున్నాడు. ఇలా ఉంటే హౌస్ లో కొంతమంది కంటెస్టెంట్స్ 'మాస్క్ వేసుకున్నాడు'. అంత నటన అన్న వాళ్ళు లేకపోలేదు. ఎక్కువ ప్రవచనాలు చెప్తాడు అని కూడా అంటున్నారు. ప్రతి మాట స్పష్టంగా మాట్లాడటమే కాకుండా హౌస్ కి ఒక పెద్ద అన్నయ్యలాగా అందరితో కలిసిపోయి ఉంటున్నాడు. కానీ హౌస్ లో రెండు మూడు వారాలు పెర్ఫార్మన్స్ చెయ్యట్లేదు. అతని పర్ఫామెన్స్ కి నాగార్జున కూడా గట్టిగానే చెప్పాడు.

"హౌస్ లో అందరు ఎవరి గేమ్ వారు ఆడాలి. ఎవరి కోసమో ఆడకూడదు. దేనిని త్యాగం చేయకూడదు. నీ ఆట నువ్వు ఆడటానికే హౌస్ లోకి వెళ్లావు" అంటు నాగార్జున చెప్పాడు. కాగా అప్పటి నుండి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ పర్వాలేదు అనిపిస్తోన్నాడు. హౌస్ లో ప్రతి వారం నామినేషన్ లో ఉంటు వస్తోన్నాడు. కాగా ప్రేక్షకులు సేవ్ చేస్తు వస్తున్నారు. ఈ వారం కూడా నామినేషన్ లో ఉన్నాడు.

ఆదిత్య రెమ్యూనరేషన్ రోజుకి యాభై వేల నుండి అరవై వేల వరకు ఉండొచ్చని బయట ప్రచారంలో ఉంది. మునుముందు తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ, తనని తాను రోజు రోజుకి మెరుగుపరుచుకొని, చివరి వరకు ఉండి విజేతగా నిలుస్తాడో లేదో చూడాలి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.