English | Telugu

Brahmamudi: మోడల్ ని రాకుండా చేసిన రాహుల్.. రాజ్ నిర్ణయం అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -907 లో.....రాహుల్ మనిషి కావ్య డిజైన్స్ వేసిందనుకోని తన క్యాబిన్ కి వెళ్లి తీసుకుంటాడు. కావ్య, రాజ్ వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. నాకు తెలుసురా నిన్ను ఇలా బయటకు రప్పించడానికే ఈ ప్లాన్ అని కావ్య అంటుంది. అతన్ని పోలీసులకి పట్టించమని మేనేజర్ కి చెప్తాడు రాజ్.

ఇప్పుడు అర్థం అయిందా నేను ఎందుకు ఇలా చేసానోనని కావ్య అంటుంది కానీ భళే ప్లాన్ చేసావని రాజ్ అనగానే ఎంతైనా మీ భార్య ని కదా అని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్య డిజైన్స్ వేస్తుంది. అవి చూసి ఇంతకన్నా శృతి మంచిగా వేస్తుందని రాజ్ అనగానే కావ్య అలిగి వెళ్తుంటే బుజ్జగిస్తాడు రాజ్. నువ్వు ఈ రోజు డిజైన్స్ వేస్తావని రేపు షూట్ కోసం మోడల్ ని కూడా పిలిచానని రాజ్ అంటాడు. దాంతో కావ్య డిజైన్స్ వెయ్యడం స్టార్ట్ చేస్తుంది. అదంతా రాహుల్ వింటాడు. మరుసటిరోజు రాజ్ షూట్ కోసం అన్ని ఏర్పాట్లు చేసి శృతిని మోడల్ కి ఫోన్ చెయ్యమని చెప్తాడు. దాంతో మోడల్ కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ విషయం రాజ్ కి చెప్తుంది శృతి. ఇప్పుడు మళ్ళీ కొత్త మోడల్ ఎక్కడ దొరకాలని టెన్షన్ పడుతాడు.

మరొకవైపు రాజ్ కి వచ్చే మోడల్ ని రాహుల్ తన ఆఫీస్ కి రప్పించుకుంటాడు. షూట్ క్యాన్సిల్ చేసుకున్నందుకు తనకి పది లక్షలు ఇస్తాడు రాహుల్. ఆ తర్వాత రాజ్ చాలా మోడల్స్ కోసం ట్రై చేస్తాడు. అందరు అందుబాటులో లేమని చెప్తారు. ఇంటికి వచ్చి రాజ్ టెన్షన్ పడుతూ అందరికి కాల్ చేస్తాడు. తరువాయి భాగంలో రాజ్ మోడల్ లేకుంటే ఎలా అని రాహుల్ అంటాడు. రాజ్ కి ఏమైనా తెలివి లేదా సెట్ చేసి ఉంటాడులే అని రుద్రాణి అనగానే కావ్య మోడల్ గా చేస్తుందని రాజ్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.