English | Telugu

వాళ్ళ స్టెప్పులు మాములుగా లేవు.. అందరూ కలిస్తే అంతేమరి

మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఒక గొప్ప అదృష్టం ఏమిటి అంటే టాలెంట్ ఉంటే చాలు హీరో, హీరోయిన్ గా అవకాశాలు రాకపోయినా సపోర్టింగ్ రోల్స్ తో ఫుల్ పాపులర్ అవ్వొచ్చు..మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అలా ఎంతో మంది హీరోయిన్స్ అవ్వాలని వచ్చి క్యారక్టర్ ఆర్టిస్టులు ఐన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఎన్నో మూవీస్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో చేసిన నటీమణులు అంతా కలుసుకుని ఫుల్ ఎంజాయ్ చేశారు.

టాలీవుడ్ లో మనకు ఎక్కువగా అమ్మ, అత్తా, వదిన, అక్కా, చెల్లి లాంటి క్యారెక్టర్స్ లో  నటించిన సురేఖా వాణి, హేమ, ప్రగతి, పవిత్రా లోకేష్ తో పాటు చాలామంది గుర్తొస్తారు. అప్పటి, ఇప్పటి మూవీస్ సక్సెస్ లో వీళ్లంతా కీ రోల్ ప్లే చేస్తున్నారు. హీరోయిన్ కి మించి నటిస్తున్నారు. తనకు అవకాశాలు రావడం లేదు అంటూ ఈమధ్య కాలంలో బాధపడిన సురేఖా వాణి తన అందాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటుంది.హీరోయిన్ రేంజ్ లో అందంగా ఉండేసరికి ఈమెకు ఎక్కువగా అక్క పాత్రలు వస్తున్నాయి.  

శైలజ ప్రియా కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది. అందంగా కనిపిస్తూ తన నటనతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్  పెంచుకుంది.  ఇలా ఒకప్పటి సపోర్టింగ్ రోల్స్ లో నటించి ఇప్పటికీ నటిస్తున్న వాళ్లంతా కూడా సరదాగా సురేఖావాణి ఇంట్లో కలుసుకున్నారు.  12 మంది సీనియర్ నటీమణులు ఒక్కచోటకు చేరారు. ఫుల్ గా ఆడి పాడారు. సురేఖావాణి ఆ ఫొటోస్ ని, వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. "రా రా రక్కమ్మ" సాంగ్ కి అందరూ కలిసి స్టెప్స్ ఇరగదీసారు. ఇక నెటిజన్స్ రెచ్చిపోయి మరీ కామెంట్స్ చేస్తున్నారు. "ప్రగతి, సుధా, పవిత్ర లోకేష్ ఆంటీలు ఎక్కడ ?" " వీళ్లు లేని సినిమా  వుండదు. వీళ్ళు చేయని పాత్రలు కూడా లేవు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వీళ్ళు వెన్నెముక లాంటి వాళ్ళు "  అంటూ కామెంట్స్ పెట్టారు.