బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడుకి పితృ వియోగం!
బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడు తండ్రి సన్యాసి రావు నాయుడు కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. సన్యాసి రావు నాయుడు మృతి పట్ల పలువురు తమ దిగ్బ్రాంతిని వ్యక్తంచేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.