English | Telugu
‘విశ్వం’ చిత్రంపై సోషల్ మీడియా టాక్!
Updated : Oct 11, 2024
గోపీచంద్, శ్రీను వైట్ల.. ఇది రేర్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. ఈమధ్యకాలంలో గోపీచంద్‌కి, శ్రీను వైట్లకు హిట్లు లేవు. మరి వీరిద్దరూ కలిసి సినిమా చేశారంటే తప్పకుండా అది సక్సెస్ అయితేనే ఇద్దరికీ ఉపయోగం ఉంటుంది. గోపీచంద్ మాస్ హీరో, శ్రీను వైట్ల మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్. వీరిద్దరూ కలిసి చేసిన సినిమా ‘విశ్వం’. అక్టోబర్ 11న దసరా కానుకగా ఈ సినిమా విడుదలైంది. పెద్ద హీరోల సినిమాలు, ఒక రేంజ్ హీరోల సినిమాలు రిలీజ్ అయినపుడు సోషల్ మీడియాలో సహజంగానే ఆ సినిమాలపై చర్చ నడుస్తూ ఉంటుంది. అలా ‘విశ్వం’ సినిమా గురించి నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారు, ఎలాంటి కామెంట్స్ పెడుతున్నారో చూద్దాం.
విశ్వం చాలా రొటీన్‌గా ఉందని, ఔట్ డేటెడ్ సబ్జెక్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ట్వీట్స్ గమనిస్తే సినిమాపై నెగెటివిటీ ఎక్కువ శాతం ఉంది అనేది అర్థమవుతోంది. ఇక ఇతర మాధ్యమాల్లోని నెటిజన్లు మాత్రం సినిమా ఫర్వాలేదు అంటున్నారు. అంత తీసి పారేసే సినిమా కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ‘అందరూ చూడదగ్గ సినిమానే. అయితే ఇది చాలా ఓల్డ్ ఫార్మాట్‌లో రూపొందిన సినిమా. ఇలాంటి సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. మనం చూశాం. కేవలం శ్రీను వైట్ల మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆశించేవారికి సెకండాఫ్ న్యాయం చేస్తుంది. అయితే కొన్ని చోట్ల ల్యాగ్ ఎక్కువైంది’ అంటున్నారు.
మరో ట్వీట్‌లో ‘శ్రీను వైట్లకు ఇది కమ్‌బ్యాక్ మూవీ కాదు. ఈమధ్యకాలంలో అతను చేసిన సినిమాలతో పోలిస్తే.. ఇది కాస్త ఫర్వాలేదు అని మాత్రం చెప్పొచ్చు. ఓవరాల్‌గా ఇది ఎబౌ ఏవరేజ్ సినిమా అని చెప్పాలి. ఒక్కసారి చూడదగ్గ సినిమా. అయితే అందరూ అంటున్నట్టుగానే ప్రీ క్లెమాక్స్, క్లైమాక్స్ లెంగ్తీగా అనిపిస్తుంది’ అన్నారు.
మరి కొందరు ఇలా ట్వీట్ చేశారు.. ‘ఈ సినిమాలో కొత్తదనం అనేది ఎక్కడా కనిపించలేదు. ప్రేక్షకుల సహనానికి పరీక్షలా అనిపిస్తుంది. గోపీచంద్ పెర్‌ఫార్మెన్స్, కొన్ని కామెడీ సీన్స్ మాత్రమే ఆడియన్స్‌కి నచ్చుతాయి. ఆడియన్స్ కథ విషయంలో ఎలాంటి టెన్షన్ పడకుండా తర్వాత ఏం జరుగుతుందో ముందే ఊహించేలా ఉంది’.
ఇలా.. సినిమాపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఏ సినిమా రిలీజ్ అయినా సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్స్ రావడం సహజమే. సినిమా రొటీన్‌గా ఉన్నా కొన్నిసార్లు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం మనం చూస్తుంటాం. ఈ సినిమా విషయానికి వస్తే బి, సి సెంటర్స్‌లో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చేలా ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన జెన్యూన్ రిపోర్ట్ తెలియాలంటే మరి కాస్త టైమ్ పడుతుంది.