English | Telugu

Tatva movie review : తత్వ మూవీ రివ్యూ

మూవీ : తత్వ
నటీనటులు: దాసరి హిమ, పూజా రెడ్డి బోరా, ఒస్మాన్ ఘని తదితరులు
ఎడిటింగ్: సి. శ్రీకర్
సినిమాటోగ్రఫీ: సి.హెచ్ సాయి
మ్యూజిక్: సాయి తేజ
నిర్మాతలు: దాసరి మానస
దర్శకత్వం: రుత్విక్ యాలగిరి
ఓటీటీ: ఈటీవి విన్

కథ: 
ఆరిఫ్ (హిమ దాసరి) ఓ సాదాసీదా ట్యాక్సీ డ్రైవర్. థామస్ (ఒస్మాన్ ఘని) అనే బిజినెస్ మ్యాన్ హత్య కేసులో అనుకోని విధంగా ఇరుక్కుంటాడు ఆరిఫ్. మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ కేసును డీల్ చేయడానికి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మరియు రెండ్రోజుల్లో డీసీపీ కోడలు కాబోతున్న జ్యోత్స్న (పూజా రెడ్డి బోరా) రంగంలోకి దిగుతుంది. ఇక తన ఇన్వెస్టిగేషన్ లో తనతో ఇదంతా చేయించింది దేవుడే అని చెప్తాడు ఆరిఫ్. అసలు ఆరిఫ్, థామస్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? థామస్ హత్య కేసులో ఆరిఫ్ ఎలా వచ్చాడు? జ్యోత్స్న ఈ కేస్ ను డీల్ చేసి ఆరిఫ్ ను నిర్దోషి అని ప్రూవ్ చేసిందా లేక శిక్ష పడేలా చేసిందా లేదా అనేది తెలియాలంటే ఈటీవీ విన్ లోని ఈ మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:
దర్శకుడు రుత్విక్ తనదైన శైలిలో థ్రిల్లింగ్ గా కథను నడిపిన విధానం బాగుంది.  సినిమా నిడివి కేవలం 58 నిమిషాలు మాత్రమే. ఇది సినిమాకి ప్లస్ అయ్యింది. అసలు కథేంటంటే.. మనిషిలో మానవత్వం అంతరిచిపోతున్నదనే విషయాన్ని చాలా సింపుల్ గా థ్రిల్లింగ్ గా ప్రేజెంట్ చేశాడు దర్శకుడు. విధానం బాగుంది. అయితే కొన్ని లాజిక్స్ సెట్ కాలేదు. ఆ విషయాలను కూడా కాస్త చూపిస్తే బాగుండేది. అంటే ల్యాగ్ వద్దనే ప్రాసెస్ లో కాస్త ఫాస్ట్ అయ్యింది.

సినిమాలో మొదటగా ఒక్కో క్యారెక్టర్ ను, ఒక్కో సందర్భానికి తగ్గట్టుగా చూపిస్తూనే ఇంటెన్స్ గా కథని నడపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.  

అడల్ట్ కంటెంట్ ఏం లేదు.. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ మూవీలో క్రైమ్ థ్రిల్లర్ కి ఎన్ని కావాలో అన్నీ ఉన్నాయి. ఇదే సినిమాకి ప్లస్ అయ్యింది. టాప్ వ్యూలో రెండు కార్లు సర్కిల్ లో‌ తిరగడం చూపించిన ఓ సీన్ బాగుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంటుంది. నేపథ్య సంగీతం కథకి ఫ్రధాన బలంగా నిలిచింది. చాలా సీన్లు బిజిఎమ్ తో అలా వెళ్తుంటాయి. సి.హెచ్.సాయి సినిమాటోగ్రఫీ బాగుంది.

నటీనటుల‌ పనితీరు: 
ఆరిఫ్ గా హిమ దాసరి ఆకట్టుకున్నాడు. అలాగే థామస్ పాత్రలో ఒస్మాన్ ఘని కూడా అలరించాడు. మరో కీలకపాత్ర పోషించిన పూజా రెడ్డి బోరా బోర్ కొట్టుకుండా నటించింది.

ఫైనల్ గా... 
డీసెంట్ థ్రిల్లర్ విత్ ఫిక్షనల్ టచ్. మస్ట్ వాచెబుల్.

రేటింగ్ : 3/5

✍️. దాసరి  మల్లేశ్