English | Telugu
నారా రోహిత్ ఎంగేజ్మెంట్.. ఆ హీరోయిన్‌తోనే అంటున్నారు?
Updated : Oct 11, 2024
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తినాయుడి కుమారుడు నారా రోహిత్ గురించి అందరికీ తెలుసు. 2009లో బాణం చిత్రంతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోహిత్ అప్పటినుంచి అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నారు. కొన్ని సినిమాలు విజయం సాధించాయి కూడా. కొన్ని పరిస్థితుల కారణంగా రోహిత్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఇతని కంటే పెద్ద వాడైన నారా శిరీష్‌కి కూడా ఇంతవరకు పెళ్లి కాలేదు. అయితే రోహిత్‌కి మాత్రం పెళ్లి ఘడియ వచ్చేస్తోంది. అక్టోబర్ 13న ఎంగేజ్మెంట్ జరగబోతోంది.
ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడుతోపాటు నందమూరి బాలకృష్ణ, వారి కుటుంబ సభ్యులు కూడా హాజరవుతారని తెలుస్తోంది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. ఈ వివాహం జరగడానికి కారణమని తెలుస్తోంది. అయితే రోహిత్ పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అనే వివరాలు మాత్రం తెలియరాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ‘ప్రతినిధి2’ చిత్రంలో రోహిత్‌తో కలిసి నటించిన అమ్మాయే వధువు అని సమాచారం.