'క్రాక్' కాంబోలో బండ్ల గణేష్ మూవీ!
నటుడు బండ్ల గణేష్ 'ఆంజనేయులు', 'గబ్బర్ సింగ్', 'బాద్ షా', 'టెంపర్' వంటి సినిమాలతో తక్కువ సమయంలోనే బడా నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఏవో కారణాల వల్ల ఎనిమిదేళ్లుగా ఆయన సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాతో మళ్ళీ నిర్మాతగా రీఎంట్రీ ఇవ్వడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు కొంతకాలంగా వార్తలొస్తున్నాయి.