రెండు సార్లూ కొడుక్కి సరైన స్క్రిప్టు ఇవ్వలేకపోయిన పూరి జగన్నాథ్!
తెలుగునాట హీరోయిజానికి సరికొత్త డైమన్షన్ ఇచ్చిన డైరెక్టర్ గా పూరీ జగన్నాథ్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. తన మొదటి సినిమా `బద్రి` (2000) మొదలుకుని `ఇడియట్` (2002), `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి` (2003), `శివమణి` (2003), `పోకిరి` (2006), `దేశముదురు` (2007), `చిరుత` (2007), `బిజినెస్ మేన్` (2012), `ఇస్మార్ట్ శంకర్` (2019) వరకు పూరీ సొంతంగా తయారుచేసుకున్న స్క్రిప్ట్ లన్నీ ఆయా చిత్రాల్లో కథానాయకులను సరికొత్తగా ఆవిష్కరించినవే.